Supreme Court : డాన్ విడుద‌ల‌పై కోర్టు నోటీసు

బీహార్ స‌ర్కార్ కు బిగ్ షాక్

Supreme Court : మాజీ ఎంపీ డాన్ ఆనంద్ మోహ‌న్ ను విడుద‌ల చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది సుప్రీంకోర్టు(Supreme Court). ఎందుకు , ఏ ప్రాతిప‌దిక‌న రిలీజ్ చేశారో వివ‌ర‌ణ ఇవ్వాలంటూ సీఎం నితీశ్ కుమార్ ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇది ఒక ర‌కంగా దెబ్బే.

తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి కృష్ణ‌య్య ను బీహార్ లో దారుణంగా హ‌త్య చేశారు. ఈ దారుణం వెనుక ఆర్ఎల్డీ నాయ‌కుడు మాజీ ఎంపీ డాన్ ఆనంద్ మోహ‌న్ ఉన్నాడ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. శిక్ష ప‌డింది. జైలులో ఉన్నాడు.

తాజాగా ఆర్ఎల్డీ, జెడీయూ , కాంగ్రెస్ క‌లిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ త‌ర్వాత డాన్ ఆనంద్ మోహ‌న్ ను విడుద‌ల చేయాల‌ని డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్ ఒత్తిడి తెచ్చాడ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనిపై చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

మాజీ ఎంపీని విడుద‌ల చేయ‌డాన్ని స‌వాల్ చేస్తూ దివంగ‌త ఆఫీస‌ర్ కృష్ణ‌య్య భార్య ఉమ సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్ర‌యించింది. సోమ‌వారం స‌ర్వోన్న‌త న్యాయ స్థానం విచార‌ణ చేప‌ట్టింది. ఇందుకు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈ కేసుకు సంబంధించి ప్ర‌భుత్వం 15 రోజుల్లోగా వివ‌రాలు ఇవ్వాల‌ని ఆదేశించింది.

ఇదిలా ఉండగా కేవ‌లం మాజీ ఎంపీ ఆనంద్ మోహ‌న్ ఒక్క‌డిని విడుద‌ల చేసేందుకు మిగ‌తా శిక్ష అనుభ‌విస్తున్న వారికి ఛాన్స్ ఇచ్చింది బీహార్ ప్ర‌భుత్వం. 14 లేదా 20 ఏళ్ల జైలు శిక్ష అనుభ‌వించిన దోషుల‌ను విడుద‌ల చేసేందుకు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. దీనిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది బాధితురాలు ఉమ‌. ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందేందుకే సీఎం రాజ్ పుత్ సామాజిక వర్గానికి చెందిన ఆనంద్ మోహ‌న్ ను విడుదల చేయించారంటూ ఉమ ఆరోపించింది.

Also Read : మాకే అధికారం మాదే రాజ్యం

Leave A Reply

Your Email Id will not be published!