దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు కేంద్రంలోని నరేంద్ర మోదీ బీజేపీకి షాక్ ఇవ్వగా కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ టీంలో కీలకంగా వ్యవహరించిన సునీల్ కనుగోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. రాష్ట్రంలో 224 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 136 సీట్లు సాధించింది. ఈ అద్భుతమైన మెజారిటీ సాధించడం వెనుక కీలకమైన వ్యూహకర్తగా ఉన్నాడు సునీల్ కనుగోలు. అన్నీ తానై వ్యవహరించాడు. ప్రస్తుతం చర్చకు దారితీసేలా చేశాడు. గతంలో బీజేపీకి కూడా పని చేశాడు. ఇక సునీల్ కనుగోలు గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నాడు. వ్యూహాలు పన్నడంలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చాడు. విస్తృతమైన అనుభవం కలిగిన స్ట్రాటజిస్ట్ గా పేరు పొందాడు.
ప్రస్తుతం ఐపాక్ పీకేకు ప్రత్యామ్నాయంగా మారాడు సునీల్ కనుగోలు. పోటా పోటీగా ప్రచారం చేయడం. ఎన్నికల క్యాంపెయిన్ లో పాల్గొనేలా చేయడం. సమస్యలను గుర్తించడం. వాటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా సోషల్ మీడియాలో విస్తృతంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యేలా చేశాడు. ఒక రకంగా కాంగ్రెస్ వ్యూహాల వెనుక సునీల్ కనుగోలు ఉన్నాడనేది బహిరంగ రహస్యం. డీకే శివకుమార్ , సిద్దరామయ్య , మల్లికార్జున్ ఖర్గే , రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇలా ప్రతి ఒక్కరికీ స్పేస్ ఇచ్చి వారిని హైలెట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు కనుగోలు. కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా, ప్రచారానికి సంబంధించి వ్యూహకర్తగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.
సునీల్ కనుగోలు ఎవరో కాదు తెలుగువాడు. ఆలోచనలకు అందడు. కానీ ఒక్కసారి డిసైడ్ అయ్యాడంటే అది గన్ కంటే ఎక్కువగా పని చేస్తుందని నమ్మాడు. వాట్సాప్ యూనివర్శిటీకి పేరు పొందిన భారతీయ జనతా పార్టీకి వెన్నులో వణుకు పుట్టించాడు. మొత్తం కాంగ్రెస్ లైన్ ను పూర్తిగా మార్చేశాడు. కొత్త టెక్నాలజీకి అనుసంధానం చేశాడు. సోషల్ మీడియాను హోరెత్తించాడు. కర్ణాటకలో మూలాలు కలిగి ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నాడు సునీల్ కనుగోలు. చెన్నైలో పెరిగాడు. గతంలో బీజేపీ, డీఎంకేకు పని చేశాడు. రాహుల్, సోనియాలతో సుదీర్ఘ చర్చల అనంతరం గత ఏడాది కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్ణాటక ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకున్నాడు. సక్సెస్ అయ్యాడు.
సునీల్ కొనుగోలు చూసేందుకు ప్రశాంతంగా ఉంటాడు. కానీ అత్యంత దృఢమైన వ్యక్తి. పూర్తి ఆధారాలు, వివరాలతో సహా హాజరవుతాడు. ప్రతి రాజకీయ నాయకుడు ఒక్కసారి సునీల్ తో కలిస్తే చాలు ఆయనకు ఫిదా అవడం ఖాయమని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనయర్ నేత ఒకరు కామెంట్ చేయడం విశేషం. ప్రస్తుతం సీఎం ఎంకే స్టాలిన్, మాజీ సీఎం పళనిస్వామితో పాటు తెలంగాణలో రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారు సునీల్ కనుగోలు. కర్ణాటకలో బస్వరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా పే సీఎం ప్రచారాన్ని హోరెత్తించాడు. ఇది పూర్తిగా మైనస్ అయ్యింది. 40 శాతం కమీషన్ స్లోగన్ గన్ లాగా పేలింది. మొత్తంగా కొనుగోలు కాంగ్రెస్ లో కీలకమైన స్ట్రాటజిస్ట్ గానే కాదు అద్భుతమైన వ్యూహకర్తగా మారాడనడంలో సందేహం లేదు.