Harihara Nandan: అద్భుత మేధా సంపన్నుడు – హరిహర నందనుడు
Harihara Nandan: చిన్నారులలో చిరుత అతడు. అతడు సాధించిన రికార్డులు చూస్తే గిన్నీస్ బుక్ సైతం అవాక్కవ్వాల్సిందే.
Harihara Nandan: చిన్నారులలో చిరుత అతడు. అతడు సాధించిన రికార్డులు చూస్తే గిన్నీస్ బుక్ సైతం అవాక్కవ్వాల్సిందే. పెద్దగా ప్రచారానికి ఒప్పుకోని ఈ బుడతడు సైలెంట్‌గా తన రికార్డులను తానే ఏడాదికేడాది అధిగమిస్తూ అప్రతిహతంగా దూసుకుపోతున్నాడు. అతనికి వచ్చిన రికార్డులు లెక్కించడానికి కనీసం ఒక రోజు పడుతుందంటే అతిశయోక్తి కాదు. ఈ బాల మేధావి మేధస్సు చూసి విశ్వమే విస్తుబోతోంది. అతి త్వరలోనే యావత్ ప్రపంచం గర్వించే స్థాయిలో ఈ చిన్నారి ఉండబోతున్నందుకు సాటి భారతీయులమైన మనమంతా గర్వించాలి. ఒకటా రెండా 12 సంవత్సరాల చిరుప్రాయంలోనే 36 అంశాలలో అనర్గళ ప్రావీణ్యం సంపాదించుకున్న ఈ బాలమేధావి ని తెలుగు ఇజమ్ ప్రతినిధి కలసి పలకరించారు. అనేక అంశాలపై ముచ్చటించారు.

పురాణ వేద పఠనాలు, సంస్కృత రచనలు, 27 నక్షత్రాలు, రాశులు, రాశిఫలాలు, జ్యోతిష్య విజ్ఞానం, పంచాంగ శ్రవణం ఇలా ఒకటేమిటి ఎన్నో సంవత్సరాలు సాధన చేసినా రాని అనితర సాధ్యమైన విజ్ఞానాన్ని ఔపాసన పట్టిన ఈ బాల శౌనక ముని పురాణాల విజ్ఞానాన్ని పుక్కిట పట్టిన ఘనుడు. ఆ ముఖంలో ఓ దైవికశక్తి..ఆధ్యాత్మిక కళ…వినయవిధేయతల చిన్నారి బాల మేధావి గురించి తెలుసుకోవాలని ఉందా…అతడే ఈడ్పుగంటి హరిహరనందన్(Harihara Nandan). ఈ బాల ఘనాపాటితో ప్రత్యేక ముఖాముఖి మీకోసం
ప్రశ్న: మీ గురించి చెబుతారా?
జవాబు: నా తల్లి ప్రముఖ జ్యోతిష్య విద్వాంసురాలు శ్రీమతి ఈడ్పుగంటి పద్మజారాణి. తండ్రి నందగోపాల్.హైదరాబాద్‌లో బ్యాంక్ ఉద్యోగి. గచ్చిబౌలి కేంద్రీయ విద్యాలయంలో 7వ తరగతి చదువుతున్నాను. బచ్‌పన్ ప్లే స్కూల్‌లో ప్రాధమిక విద్య అనంతరం ముంబాయి పోవాయి ఐఐటీ కేంద్రీయ విద్యాలయంలో 5వ తరగతి వరకూ చదివాను. తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వచ్చాను. ఇక్కడే ప్రస్తుతం చదువుతున్నాను.
ప్రశ్నః చిన్నవయసులోనే ఎన్నో పురస్కారాలు తీసుకున్నారు. మీకు స్ఫూర్తి ఎవరు?
జవాబు: నాకు గోరు ముద్దల వయసులోనే హైందవ సంస్కృతి గొప్పతనం, రామాయణ, మహాభారత, భాగవతాది గ్రంధాల సారాన్ని మా అమ్మ పద్మజారాణి నాకు ఆసక్తికరంగా చెప్పేవారు. ఆమెకు జ్యోతిష్యంలో 18 డిగ్రీలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలలో తొలి మహిళా శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. అలాంటి ప్రతిభాపాటవాలు కలిగిన మహాతల్లికి కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఏ విషయంలోనైనా ఆమే స్ఫూర్తిదాయకం. నా రోల్ మోడల్ అని గర్వంగా చెబుతాను.
ప్రశ్నః ఒకపక్క చదువు, మరో పక్క సకలశాస్త్రాలపై పట్టు సాధించడంలో ఎలాంటి సమస్యలు రాలేదా?
జవాబుః ఈ ప్రపంచంలో ఇష్టపూర్వకంగా చేసే ఏ పని అయినా కష్టమే అనుకున్నా ఇష్టంగానే ఉంటుంది. చిన్నప్పటినుంచి చదువుల్లో అగ్రశ్రేణిగా నిలబడుతూ వస్తున్నాను. నా ప్రతిభను గమనించి పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, సిబ్బంది నాకు ఎంతగానో సహకరిస్తూ వస్తున్నారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను.
ప్రశ్నః నీకు ఇష్టమైన హాబీలు
జవాబు: ఫొటోగ్రఫీ, ట్రావెలింగ్, రైటింగ్, స్పేస్ ఆస్ట్రానమీ, కోడింగ్‌తో పాటు వంటలు కూడా చక్కగా చేస్తాను.
ప్రశ్నః నీకు వచ్చిన 36 పురస్కారాల గురించి చెబుతావా?
జవాబు: తప్పకుండా
1. కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్ చిన్న వయసులోనే… ముంబై 2018.
2. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ‘మల్టీ టాలెంటెడ్ కిడ్’ (మార్షల్,స్పిరిట్యుయల్)ముంబై 2018.
3. సంఖ్యాశాస్త్రంలో ‘పిక్ యువర్ సన్‌షైన్’ ఆంగ్ల పుస్తకం రాశాను.ముంబై 2018.
4. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి రామాయణంపై అన్ని కాండాలు ఆంగ్లంలో చూడకుండా అనర్గళంగా చెప్పి రికార్డు సాధన, హైదరాబాద్ 2019
5. మహాత్మా జ్యోతిరావు పూలే నేషనల్ అవార్డ్ (చైల్డ్ కేటగిరి) (పీపుల్ సోషల్ సర్వీస్… ఎడ్యుకేషనల్ డెవప్‌మెంట్ సొసైటీ ప్రభుత్వ గుర్తింపు కలిగిన సంస్థ న్యూ ఢిల్లీ )కర్నూల్. 2019
6. నాలుగు సంవత్సరాల వయసునుంచే తల్లితో కలిసి పంచాంగ శ్రవన్ టి.వి.లోచేస్తూ.
7. చిన్నబాలుడు వ్యక్తిగతంగా పంచాంగ శ్రవణం చేయడంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ హైదరాబాద్, 2020.
8. తల్లీతనయుల జోడియాక్ బంధంపై ఆంగ్ల పుస్తకం రచన (సంఖ్యాశాస్త్రం).
9. థర్డ్ ఇండోశ్రీలంక ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్ 2017, ఖాతా, కుమితి గోల్డ్ మెడల్స్.
10. రెండుసార్లు కరాటేలో వరుసగా బెస్ట్ మేల్ క్రెడిట్ అవార్డ్(వెపెన్స్ ట్రైనింగ్ ) (ఐఐకెఎఫ్), ముంబై నుంచి 2017, 2018.
11. కరాటేలో గ్రాండ్ ఛాంపియన్‌షిప్ అండర్ 13 బాలు ర ట్రోఫి.ముంబై, 2019
12. తెలంగాణ నుంచి పాల్గని ట్రోఫి అందుకున్న అతి పిన్నవయస్కుడు (అవుట్ స్టేట్ పార్టిసిపేట్) స్వాభిమాన్ భారత కప్ 13వ ఐఐకెఎఫ్ (అంతర్జాతీయ ఇండో`రియో కరాటే డో ఫెడరేషన్, ముంబై), 2019.
13. ఇంటర్నేషనల్ వండర్ బుక్ (యుకె) ఆఫ్ రికార్డుల్లో 9 విభిన్న రంగాలో తొలి వండర్ కిడ్‌గా నమోదు, హైదరాబాద్ 2019.
14. ఆదిత్య హృదయం 1నిమిషంలో అతి ఎక్కువసార్లు పఠించిన బాలుడుగా రికార్డ్ నమోదు ` ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, 2020.
15. జ్యోతిషపరమైన వివిధరకాలైన రెమిడియల్ శ్లోకాలను ఆంగ్ల భాషలో వివరణ ఇచ్చిన చిన్న బాలుడిగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, 2020.
16. మొదటి మల్టీ టాలెంటెడ్ కిడ్ జోడియాక్ రైటర్‌గా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు,హైదరాబాద్ 2020.
17. తల్లితో కలిసి పంచాంగ శ్రవణం చేసిన చిన్న బాలుడిగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు,హైదరాబాద్ 2020.
18. చిరుప్రాయంలోనే మల్టీ టాలెంటెడ్‌గా ‘రజత గండపేరుండం’ గ్రహీత, హైదరాబాద్ 2019.
19. ఇండియా స్టార్ ప్రౌడ్ అవార్డ్ (లిటిల్ ఆస్ట్రో న్యూమరాజిస్ట్ & షోధన్ ఇన్ మార్షల్ ఆర్ట్స్) ఇండియా స్టార్ బుక్ అఫ్ రికార్డ్స్, ఉత్తరప్రదేశ్ .
20. కలాం బుక్ ఆఫ్ రికార్డ్స్ (మల్టీ టాలెంటెడ్ మదర్ అండ్ మల్టీ టాలెంటెడ్ సన్) కలాం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ (చెన్నై).తమిళనాడు
21. యూనిక్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ (ట్రీ ప్లాంటేషన్) 2014.
22. ఇండియా స్టార్ ఫ్యాషన్ అవార్డ్ (లిటిల్ ఆస్ట్రో న్యూమరాజిస్ట్ & షోధన్ ఇన్ మార్షల్ ఆర్ట్స్).
23. కవర్ పేజి మోడలింగ్ (తెలుగు , హింది మ్యాగజైన్ కవర్ పేజి).ముంబై, హైదరాబాద్
24. సన్ అండ్ మదర్ ర్యాంప్ వాక్ షో (ఫస్ట్ రన్నరప్ తెంగాణ వండర్ కిడ్ ఫ్యాషన్ షో), హైదరాబాద్.
25. మదర్ విత్ సన్ సేమ్ స్టేజి అవార్డ్స్ (నాన్‌స్టాప్ అవార్డ్స్ రిసీవింగ్ ఎలాంగ్‌విత్ మదర్).
26. ఎక్స్‌ట్రార్డనరీ టాలెంట్ అవార్డ్ (మార్షల్ ఆర్ట్స్ & స్పిరిట్యుయాలిటి) జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ 2019.
27. ముంబై కరాటే అన్యుయేల్ వింటర్ స్పెషల్ క్యాంపు డిఫెన్సె ట్రైనింగ్ లో విరార్ లో ఐఐకెఎఫ్
IIKF వారి బెస్ట్ స్టూడెంట్ అఫ్ ఇయర్ 2019, బెస్ట్ క్యాడెట్ అవార్డు విత్ ట్రోఫీ, 2019డిసెంబర్, మహారాష్ట్ర
28. వివేకానంద జాతీయ పురస్కారం
తో పాటు బాల మేధావి టైటిల్ (యువ ఆర్ట్స్ వారి )2020 జనవరి,తెలంగాణ29. హనోరోరి గోల్డ్‌మెడల్, జోతిష్య మహాసాగర బిరుదుతో 43 వ ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఓరియంటల్ హెరిటేజ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ .2020ఫిబ్రవరి, కోలకతా, వెస్ట్ బెంగాల్
30. పిక్ యువర్ నెంబర్(ఫైండ్ యువర్ పర్సనాలిటీ ) పుస్తకం రిలీజ్ 43 వ అంతర్జాతీయ సదస్సు, ఐఐఓహెచ్ (IIOH) రవీంద్ర భవన్, కొలకత్తా, వెస్ట్ బెంగాల్
31. ఆసియా బుక్ అఫ్ రికార్డ్స్ లో *గ్రాండ్ మాస్టర్ * గా రామాయణం 7 కాండలు చెప్పిన బాలుడిగా నమోదు, 2020 హైదరాబాద్, తెలంగాణ
32. కరాటే బ్లాక్ బెల్ట్ కన్ఫర్మేషన్(, బ్లాక్ బెల్ట్ 2 కి ప్రవేశం) సర్టిఫికెట్ ముంబై ఐఐకెఎఫ్ IIKF వారి ద్వారా మొన్ననే తీసుకున్నాడు
33. అల్ ఇండియా లైవ్ 14 th స్వాభిమాన్ భారతకప్ నేషనల్ ఛాంపియన్షిప్ కాట విన్నర్ , గోల్డ్ మెడల్ goldmedal,10 నుండీ 11 సంవత్సరాల బాలుర బ్లాక్‌బెల్ట్ విభాగంలో మొదటిస్థానం, బంగారుపతకం పొందాను.
34. ఇంటర్నేషనల్ వర్చువల్ ఛాంపియన్ షిప్ 13 దేశాలు పాల్గొన్నాయి. వరల్డ్ కైండ్‌నెస్ దినోత్సవం సందర్భముగా జరిగిన ఈ ఇంటర్నేషనల్ కాటా ఛాంపియన్ షిప్‌లో 10 నుండీ 11 సంవత్సరాల బాలుర బ్లాక్‌బెల్ట్ విభాగంలో మొదటిస్థానం,ట్రోఫీ బంగారుపతకం పొందాను.
35. మొదటి ఎడ్యుకేషనల్ అప్ ఐన *కిడ్జ్ బైట్* ద్వారా జూనియర్ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత, మరియు హైదరాబాద్ మరియు ముంబై నుండీ వెలువడే ప్రము ఖ తెలుగు, ఇంగ్లీష్ దినపత్రికలలో స్పిరిట్యుయల్, టూరిజం మరియు ముఖ్యమైన ఈవెంట్స్ పై కోలోమిస్ట్.
36. తెలుగు,హిందీ,ఇంగ్లీష్ 3 భాషలలో రాశిఫలాలు,పంచాంగం చెప్పిన మొదటి బాలుడు
– ఇంటర్వ్యూ : ఎం రామ్‌గోపాల్, జర్నలిస్ట్ , హైదరాబాద్

No comment allowed please