NTR Shata Jayanthi : 20న హైదరాబాద్ లో ఎన్టీఆర్ శతజయంతి
ఎన్టీఆర్ లిటరేచర్..సావనీర్..వెబ్ సైట్
NTR Shata Jayanthi : దివంగత సీఎం, నటుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శత జయంతిని(NTR Shata Jayanthi) పురస్కరించుకుని మే 20న శనివారం హైదరాబాద్ లో వేడుకలు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ తో పాటు వెబ్ సైట్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ కైతలాపూర్ మైదానంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు మాజీ సీఎం , టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.
ఈ వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ సమగ్ర సినీ, రాజకీయ జీవితంలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన సహచర నటీ నటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, దర్శకులు, పాత్రికేయులు, రాజకీయ నాయకులు, వివిధ పార్టీల నేతలు, సంపాదకులు వెలిబుచ్చిన అభిప్రాయాలు, ప్రత్యేకంగా రాసిన వ్యాసాలను సంకలనం చేసిన శక పురుషుడు ప్రత్యేక సావనీర్ ను ఆవిష్కరించనున్నారను. అదే విధంగా ఎన్టీఆర్ సమగ్ర జీవితానికి సంబంధించిన విశేషాలు, సినీ పాటలు, సినిమాలు, ఉపన్యాసాలు, తదితర పూర్తి సమాచారంతో రూపొందించిన జై ఎన్టీఆర్ వెబ్ సైట్ ను ఆవిష్కరిస్తారు.
అతిథులుగా హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, సీపీఐ, సీపీఎం నేతలు డి. రాజా, సీతారామ్ ఏచూరి, బీజేపీ జాతీయ నాయకురాలు పురందేశ్వరి, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ , కన్నడ హీరో శివకుమార్ , హీరోలు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ , ప్రభాస్ , వెంకటేశ్ , సుమన్ , మురళీ మోహన్ , కళ్యాణ్ రామ్ , జయప్రద తో పాటు దర్శకుడు రాఘవేంద్ర రావు, నిర్మాతలు ఆది శేష గిరి రావు, అశ్వనీ దత్ పాల్గొంటారు.
Also Read : Oracle Lay offs