Shubhman Gill : గిల్ దెబ్బకు బెంగళూరు గిల గిల
ఆర్సీబీ ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
Shubhman Gill : బెంగళూరు వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ ఆద్యంతమూ ఉత్కంఠ భరితంగా సాగింది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మరోసారి ఆర్సీబీకి చుక్కలు చూపించింది. అసాధారణమైన ఆట తీరుతో ఆకట్టుకుంది. కంటిన్యూగా గెలుస్తూ జైత్రయాత్ర సాగింది. పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది.
198 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది గుజరాత్ టైటాన్స్. వృద్దిమాన్ సాహా త్వరగా ఔట్ అయినా ఆ తర్వాత మరో ఓపెనర్ , స్టార్ హిట్టర్ శుభ్ మన్ గిల్(Shubhman Gill) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బెంగళూరు బౌలర్లపై విరుచుకు పడ్డాడు. ఫోర్లు, సిక్సర్ల మోత మోగించాడు. చివరకు విన్నింగ్ షాట్ కూడా సిక్స్ తో నే ముగించాడు. తను ఐపీఎల్ 16వ సీజన్ లో వరుసగా రెండో సెంచరీ నమోదు చేశాడు. వ్యక్తిగత అత్యధిక పరుగుల క్రికెటర్ల జాబితాలో టాప్ త్రీలోకి చేరుకున్నాడు గిల్.
శుభ్ మన్ గిల్ కొట్టిన కొన్ని సిక్సర్లు ఔరా అనిపించేలా ఉన్నాయి. మహ్మద్ సిరాజ్ బౌలింగ్ అద్భుతంగా కొట్టిన సిక్స్ విస్తు పోయేలా చేసింది. గిల్ మ్యాచ్ చివరి దాకా ఉన్నాడు. మరో క్రికెటర్ విజయ్ శంకర్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఆపై స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. గుజరాత్ దెబ్బకు ఆర్సీబీ ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. దీంతో పాటు ఆర్ఆర్ కూడా ఇంటి బాట పట్టింది.
Also Read : RCB vs GT IPL 2023