Vijay Shankar : వారెవ్వా విజ‌య్ శంక‌ర్

కీల‌క ఇన్నింగ్స్ తో జోర్దార్

Vijay Shankar : బెంగ‌ళూరు వేదికగా జ‌రిగిన కీల‌క పోరులో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చాప చుట్టేసింది. ప్లే ఆఫ్స్ కు వెళ‌దామ‌ని అనుకున్న ఆ జ‌ట్టు ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది గుజ‌రాత్ టైటాన్స్. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 197 ప‌రుగులు చేసింది. ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ ఈ సీజ‌న్ లో రెండో సెంచ‌రీ న‌మోదు చేశాడు. 101 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు.

అనంత‌రం 198 ప‌రుగుల భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన డిఫెండింగ్ ఛాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్ వృద్దిమాన్ సాహా వికెట్ ను కోల్పోయింది. ఈ త‌రుణంలో శుభ్ మ‌న్ గిల్ , విజ‌య్ శంక‌ర్(Vijay Shankar) క‌లిసి ఇన్నింగ్స్ ను చ‌క్క‌దిద్దారు. భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఇద్ద‌రూ అద్భుతమైన షాట్స్ తో అల‌రించారు. స్టేడియం న‌లు వైపులా దంచి కొట్టారు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు.

గుజ‌రాత్ స్టార్ క్రికెట‌ర్ శుభ్ మ‌న్ గిల్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. చిచ్చ‌ర పిడుగులా రెచ్చి పోతే మ‌రో వైపు విజ‌య్ శంక‌ర్ తానేమీ త‌క్కువ కాదంటూ దంచి కొట్టాడు. దీంతో ప‌రుగుల వ‌ర‌ద పారింది. గిల్ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. చివ‌రి దాకా ఉన్నాడు. ఇక విజ‌య్ శంక‌ర్ ఈ సీజ‌న్ లో మ‌రో హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. 35 బంతులు ఎదుర్కొన్న శంక‌ర్ 53 ర‌న్స్ చేశాడు. గిల్ తో క‌లిసి 123 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు.

Also Read : Shubhman Gill

 

Leave A Reply

Your Email Id will not be published!