Ravichandran Ashwin : ఆట‌లో గెలుపు ఓట‌ములు స‌హ‌జం

స్టార్ బౌల‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్

Ravichandran Ashwin : ఐపీఎల్ లీగ్ ద‌శ ముగిసింది. ఎవ‌రు ప్లే ఆఫ్స్ కు చేరుకుంటార‌నే దానిపై ఉత్కంఠ వీడింది. హైద‌రాబాద్ ను ఓడించి ముంబై ఇండియ‌న్స్ టాప్ 4 ప్లేస్ లోకి చేరుకుంది. ఇక ఆర్సీబీ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది గుజ‌రాత్ టైటాన్స్. దీంతో ఆ జ‌ట్టుతో పాటు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ సైతం ఐపీఎల్ 16వ సీజ‌న్ నుంచి నిష్క్ర‌మించింది.

టోర్నీ ఆరంభంలో దుమ్ము రేపిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆ త‌ర్వాత పేల‌మైన ఆట తీరుతో నిరాశ ప‌రిచింది. కేవ‌లం 7 మ్యాచ్ ల‌లో గెలుపొంది 7 మ్యాచ్ లు ఓడి పోయింది. చివ‌రి దాకా ముంబై , బెంగ‌ళూరు, రాజ‌స్థాన్ మ‌ధ్య పోటీ ఉండేది. కానీ ఆ ఆశ‌లు కూడా ఆవిరై పోయాయి. ఇక రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఇంటి బాట ప‌ట్టింది.

ప్లే ఆఫ్స్ లోకి గుజ‌రాత్ టైటాన్స్ , చెన్నై సూప‌ర్ కింగ్స్ , ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ , ముంబై ఇండియ‌న్స్ చేరుకున్నాయి. ఈ సంద‌ర్బంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ర‌విచంద్ర‌న్ అశ్విన్(Ravichandran Ashwin) తీవ్రంగా స్పందించాడు. ప్లే ఆఫ్స్ కు చేరుకున్న ముంబైని అభినందించాడు. ఆట‌లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మ‌ని పేర్కొన్నాడు. తాము కూడా శ‌క్తి వంచ‌న లేకుండా ఆడామ‌ని కానీ ల‌క్ కూడా క‌లిసి రాలేద‌న్నాడు.

ఇదిలా ఉండ‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్కిప్ప‌ర్ సంజూ శాంస‌న్ , ఓపెన‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ తో పాటు ఇత‌ర ఆట‌గాళ్లు ఎవ‌రూ ఆశించిన మేర రాణించ లేక పోయారు. య‌శ‌స్వి జైస్వాల్ , షిమ్రోన్ హెట్మెయ‌ర్ ప‌ర్వాలేద‌ని అనిపించారు.

Also Read : Nara Lokesh

Leave A Reply

Your Email Id will not be published!