MI vs GT Qualifier2 IPL 2023 : సమ ఉజ్జీల పోరుకు రెఢీ
క్వాలిఫైయర్ -2లో విజేత ఎవరో
MI vs GT Qualifier2 IPL 2023 : గత 2 నెలలుగా కోట్లాది మందిని అలరిస్తూ వస్తున్న ఇండియన్ ప్రిమీయర్ లీగ్ 16వ సీజన్ ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే జైత్రయాత్ర చేస్తూ వస్తున్న హార్దిక్ పాండ్యా సేనకు కోలుకోలేని షాక్ ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై వేదికగా జరిగిన క్వాలిఫైయర్ -1 లో ధోనీ సేన సత్తా చాటింది. దుమ్ము రేపింది. 15 పరుగుల తేడాతో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఘన విజయాన్ని నమోదు చేసింది. నేరుగా ఫైనల్ కు చేరింది. ఐపీఎల్ చరిత్రలో 10 సార్లు ఫైనల్ కు చేరుకుంది.
దీంతో చెన్నై చేతిలో చిత్తయిన గుజరాత్ టైటాన్స్(GT) ఎలిమినేటర్ మ్యాచ్ లో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్(MI). లక్నో సూపర్ జెయింట్స్ పై ఏకంగా 81 పరుగుల తేడాతో గెలుపొందింది. గత సీజన్ లో పేలవమైన ప్రదర్శనతో నిరాశకు గురి చేసిన ముంబై ఇండియన్స్ ఈసారి సీజన్ లో మాత్రం దుమ్ము రేపింది. ఏకంగా ప్లే ఆఫ్స్ కు చేరుకుని విస్తు పోయేలా చేసింది. ఆర్సీబీ ఆశలపై గుజరాత్ నీళ్లు చల్లితే చెన్నై గుజరాత్ కు షాక్ ఇచ్చింది.
ఇక కీలక పోరులో లక్నో మరోసారి ఎలిమినేటర్ మ్యాచ్ లో బోల్తా పడింది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా కీలక మ్యాచ్ కొనసాగనుంది. ఇరు జట్లు అత్యంత బలంగా ఉన్నాయి. ఎలిమినేటర్ -2 మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వాళ్లు ఫైనల్ కు వెళతారు.
Also Read : Chandrababu Naidu