Mohit Sharma : మోహిత్ శ‌ర్మ‌కు కోలుకోలేని షాక్

వికెట్లు తీసినా జ‌డేజా ఫినిషింగ్ ట‌చ్

Mohit Sharma : అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ ఫైన‌ల్ 2023 పోరు ఆస‌క్తిక‌రంగా, ఉత్కంఠ భ‌రితంగా సాగింది. చివ‌రి బంతి దాకా నువ్వా నేనా అన్న రీతిలో టెన్ష‌న్ రేపింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ 4 వికెట్లు కోల్పోయి 214 ర‌న్స్ చేసింది. మ్యాచ్ కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది. దీంతో అంపైర్లు డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిని అనుస‌రించారు. నిర్ణీత 15 ఓవ‌ర్ల‌లో 171 ర‌న్స్ ను ల‌క్ష్యంగా నిర్దేశించారు చెన్నై సూప‌ర్ కింగ్స్ కు.

ఈ స‌మ‌యంలో బ‌రిలోకి దిగిన సీఎస్కే రియ‌ల్ ఛాంపియ‌న్స్ గా ఆడింది. త‌మ‌కు ఎదురే లేదంటూ స‌త్తా చాటింది. స‌మిష్టిగా రాణించ‌డంతో విజ‌యం వ‌రించింది. వ్య‌క్తిగ‌తంగా భారీ స్కోర్ చేయ‌క పోయినా ప్ర‌తి ఆట‌గాడు కీల‌క‌మైన ప‌రుగులు చేయ‌డంలో ముఖ్య భూమిక పోషించారు. ఆరంభంలో చెన్నై త‌డ‌బ‌డినా చివ‌ర‌కు గాండ్రించిన పులిలా జూలు విదిల్చింది.

డేవిన్ కాన్వే మ‌రోసారి స‌త్తా చాటాడు. త‌నే జ‌ట్టులో అత్య‌ధిక స్కోర‌ర్ గా నిలిచాడు. 47 ర‌న్స్ చేశాడు. శివ‌మ్ దూబే 32 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిస్తే. గైక్వాడ్ 26 , ర‌హానే 27 ర‌న్స్ చేశాడు. ఇక మ్యాచ్ గెల‌వాలంటే చెన్నైకి 20వ ఓవ‌ర్ లో 13 ర‌న్స్ కావాల్సి వ‌చ్చింది. హార్దిక్ పాండ్యా మోహిత్ శ‌ర్మ‌కు(Mohit Sharma) ఛాన్స్ ఇచ్చాడు.

డాట్ బాల్స్ వేసి గుజ‌రాత్ లో ఆశ‌లు రేకెత్తించాడు. ఈ త‌రుణంలో క్రీజులో ఉన్న జ‌డ్డూ ఊహించ‌ని రీతిలో విరుచుకు ప‌డ్డాడు. జ‌డేజా 6 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ ఒక సిక్స‌ర్ తో స‌త్తా చాటాడు. ఆఖరి రెండు బంతుల‌కు 6 , ఫోర్ బాదాడు. చెన్నైకి చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని చేకూర్చి పెట్టాడు జ‌డేజా. మోహిత్ శ‌ర్మకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. 36 ప‌రుగులు ఇచ్చిన శ‌ర్మ 3 వికెట్లు తీశాడు.

Also Read : Rahane Shivam Dube

 

Leave A Reply

Your Email Id will not be published!