Rahane Shivam Dube : రాణించిన శివమ్ దూబే..రహానే
చెన్నై గెలుపులో కీలక పాత్ర
Rahane Shivam Dube : ఐపీఎల్ 16వ సీజన్ కథ ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్ సత్తా చాటింది. విశ్వ విజేతగా నిలిచింది. తనకు ఎదురే లేదని రికార్డు సృష్టించింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో 5 వికెట్ల తేడాతో సీఎస్కే గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 214 రన్స్ చేసింది. అనంతరం మ్యాచ్ కు వర్షం ఆటంకిగా మారింది. దీంతో ఐపీఎల్ రూల్స్ ప్రకారం డక్ వర్త్ లూయిస్ పద్దతిని అమలు చేశారు అంపైర్లు.
దీంతో నిర్ణీత లక్ష్యాన్ని 15 ఓవర్లకు కుదించారు. మొత్తం 171 రన్స్ టార్గెట్ గా నిర్ణయించారు. చివరకు అర్ధరాత్రి 12.10 గంటల సమయంలో సీఎస్కే బ్యాటింగ్ కు దిగింది. నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ సాగింది. గెలుపు ఇరు జట్లను ఊరించింది. ఈ తరుణంలో భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారీ స్కోర్ చేయడంలో టాప్ స్కోరర్ గా నిలిచాడు డెవాన్ కాన్వే. కేవలం 25 బంతులు ఎదుర్కని 47 రన్స్ చేశాడు.
చెన్నై ఆటగాళ్లలో ప్రతి ఒక్కరు భారీ స్కోర్ చేయక పోయినా కావాల్సిన పరుగుల్ని చేసుకుంటూ వెళ్లి పోయారు. దీంతో లక్ష్యం చిన్నదై పోయింది. చివరకు జడేజా ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఇక శివమ్ దూబే(Shivam Dube) 21 బంతులు ఎదుర్కొని 32 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. గైక్వాడ్ 3 ఫోర్లు ఒక సిక్సర్ తో 26 రన్స్ చేశాడు. అజింక్యా రహానే(Rahane) 13 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 2 సిక్సర్లతో 27 రన్స్ చేశాడు. అంబటి రాయుడు ఒక ఫోర్ 2 సిక్సర్లతో 19 పరుగులతో సత్తా చాటారు.
Also Read : Devon Conway
