Shah Rukh Khan : క‌ష్ట‌ప‌డి ప‌ని చేయ‌డమే మ‌తం

బాలీవుడ్ న‌టుడు షారుఖ్ ఖాన్

Shah Rukh Khan : ప్ర‌ముఖ దిగ్గ‌జ బాలీవుడ్ న‌టుడు షారుఖ్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు తెలిసింది ఒక‌టే మ‌తం అని అన్నాడు. ఆ మ‌తం అన్న‌ది ఏమిటంటే క‌ష్ట‌ప‌డి ప‌ని చేయ‌డం త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు. ఈ ప్ర‌పంచంలో ఇంత‌కు మించింది ఏమీ లేద‌ని స్ప‌ష్టం చేశారు. తాను ఎన్నో ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నాన‌ని, బాలీవుడ్ త‌న‌కు జీవితాన్ని ఇచ్చింద‌ని చెప్పాడు షారుఖ్ ఖాన్(Shah Rukh Khan).

జీవితం సినిమా కాదు. ఎందుకంటే ప్ర‌తి దానిని మేం సినిమా లాగా ఆలోచిస్తామ‌ని అంద‌రూ అనుకుంటారు. సినిమాల్లో న‌టించ‌డం అల‌వాటై పోయింది. ఇక లైఫ్ లో కూడా అలాగే న‌టించాల‌ని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి అని అభిప్రాయ‌ప‌డ్డారు. తెర మీద బొమ్మ‌ల్ని మాత్ర‌మే చూస్తారు. కానీ తెర వెనుక క‌దిలే క‌న్నీటి బొమ్మ‌ల్ని ఎంద‌రు చూస్తార‌ని ప్ర‌శ్నించారు. మాకూ క‌న్నీళ్లు ఉంటాయి. ఆలోచ‌న‌లు, అనుభూతులు, అనుబంధాలు ఉంటాయ‌ని పేర్కొన్నాడు.

తాను ఎన్న‌డూ బాధ‌కు లోను కాలేద‌ని, కానీ త‌న త‌న‌యుడు డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ చేశాక మాన‌సికంగా చాలా ఉద్విగ్న‌త‌కు గురైన‌ట్లు వాపోయాడు. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండ‌ద‌న్నాడు షారుఖ్ ఖాన్. గెలుపు ఓట‌ములు, ఈ ప‌ల‌క‌రింపులు, స‌న్మానాలు, పుర‌స్కారాలు అన్నీ తాత్కాలిక‌మేన‌ని స్ప‌ష్టం చేశాడు బాలీవుడ్ బాద్ షా. మ‌తం పేరుతో విభేదాలు సృష్టించ‌డం మానుకోవాల‌ని త‌న‌కు తెలిసిన మ‌తం ఒక్క‌టే క‌ష్ట‌ప‌డి ప‌ని చేయ‌డమేన‌ని పేర్కొన్నాడు.

Also Read : Rahul Gandhi

 

Leave A Reply

Your Email Id will not be published!