Ashok Gehlot : మహిళా రెజ్లర్లపై కేంద్రం వివక్ష – సీఎం
మోదీ తీరుపై నిప్పులు చెరిగిన గెహ్లాట్
Ashok Gehlot : రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ నిప్పులు చెరిగారు. మహిళా రెజ్లర్లు తమకు న్యాయం చేయాలని కోరుతూ గత ఏప్రిల్ 23 నుంచి ఆందోళన బాట పట్టారు. చివరకు తాము సాధించిన పతకాలను గంగలో వేస్తామని బయలు దేరారు. సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు అడ్డుకోవడంతో విరమించుకున్నారు. ఇంత జరిగినా ఇప్పటి వరకు భారత రెజ్లర్ల సమాఖ్య చీఫ్ , భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot).
ఢిల్లీ పోలీసులు కేంద్రం చెప్పినట్టు ఆడుతున్నారని, వారిని మహిళలని చూడకుండా ఇష్టానుసారం దాడి చేశారని దీనిని చూసి తాను తట్టుకోలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం. తమ రాష్ట్రంలో ఎవరు చిల్లర పనులు చేసినా లేదా మహిళలు, చిన్నారులను లైంగిక, శారీరక, మానసిక వేధింపులకు గురి చేసినా వెంటనే కేసు నమోదు చేస్తామని చెప్పారు అశోక్ గెహ్లాట్. కానీ ఇప్పటి వరకు ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. చివరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్ జోక్యం చేసుకుంటేనే కానీ ఢిల్లీ ఖాకీలు కేసులు నమోదు చేయలేదని ధ్వజమెత్తారు రాజస్థాన్ సీఎం.
బేటీ బచావో బేటీ పడావో అంటూ మోదీ చేస్తున్న ప్రచారం ఒట్టిదేనని తేలి పోయిందని ఎద్దేవా చేశారు. రాజస్థాన్ లోని పాలిలో జరిగిన బహిరంగ సభలో అశోక్ గెహ్లాట్ ప్రధానమంత్రిపై నిప్పులు చెరిగారు. ఇదిలా ఉండగా భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి రాకేష్ టికాయత్ జూన్ 9 లోపు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ ను అరెస్ట్ చేయక పోతే దేశ వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Also Read : Udhay Nidhi Stalin CM