Smita Sabharwal : సీఎంఓలో సెక్రటరీ గా పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్(Smita Sabharwal) వైరల్ గా మారారు. ఆమె నిత్యం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. గతంలో కలెక్టర్ గా విశిష్ట సేవలు అందించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నిబద్ధత కలిగిన అధికారిణిగా గుర్తింపు పొందారు. దీంతో అనతి కాలంలోనే పదోన్నతి పొందారు. ఆపై తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం దృష్టిని ఆకర్షించారు. చివరకు కీలకమైన పదవిలో కొలువు తీరారు.
కేసీఆర్ కు వ్యక్తిగత కార్యదర్శిగా, మిషన్ భగీరథ పర్యవేక్షణ అధికారిణిగా, సీఎం ఓఎస్డీగా కూడా ఉన్నారు స్మితా సబర్వాల్. ఆ మధ్యన వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. తాజాగా ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఆమె ఏం చేసినా ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా చూసుకున్నారు.
ఇక స్మితా సబర్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఎక్కడికి వెళ్లినా పర్యావరణం బాగుండాలని కోరుతున్నారు. జనాన్ని చైతన్యవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా స్మితా సబర్వాల్ స్మితం హితం పేరుతో మొక్కలు, చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఓ మొక్కను నాటుతూ ఇలా దర్శనం ఇచ్చారు. మొక్కలు నాటండి పర్యావరణాన్నికాపాడండి అంటూ పిలుపునిచ్చారు స్మితా సబర్వాల్.
ఇదే క్రమంలో భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎంపీ సంతోష్ రావు ఏకంగా గ్రీన్ ఛాలెంజ్ పేరుతో మొక్కలు నాటే పనిని పెట్టుకున్నారు. ఇక ప్రభుత్వం స్వయంగా హరిత హారం పేరుతో శ్రీకారం చుట్టింది.
Also Read : Sakshi Malik Punia : పనిలో చేరినా పోరాటం ఆగదు