NK Venkatesan Comment : మృత్యుంజయుడు ఆపద్బాంధవుడు
రైలు దుర్భటనలో వెంకటేశన్ సేవలు భేష్
NK Venkatesan Comment : దేశాన్ని కలిచి వేసిన ఒడిశా రైలు ఘటనలో బతికి బయట పడడమే కాదు సహాయక చర్యల్లో పాల్గొని మానవత్వం ఇంకా బతికే ఉందని చాటాడు తమిళనాడుకు చెందిన వెంకటేశన్(Venkatesan). ఆయన చేసిన సాయానికి ఇవాళ దేశం ప్రశంసలు కురిపిస్తోంది. సాయం చేయాలన్న తపన ఎందరో ప్రాణాలు పోకుండా కాపాడింది. ఇక బాలా సోర్ లో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొన్న ఘటనలో భారీగా ప్రాణ నష్టం చోటు చేసుకుంది. వెయ్యికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఘటన జరిగిన వెంటనే స్పందించింది మాత్రం తమిళనాడుకు చెందిన రెస్క్యూ సర్వీసెస్ ఆఫీసర్ వెంకటేశన్(Venkatesan). ఆ ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు. అంతే కాదు రైలు ప్రమాదం నుండి బయట పడ్డాడు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళంలో సభ్యుడిగా ఉన్నాడు. పాపనాశనంలో తన అనుభవాన్ని పంచుకున్నాడు.
వెంకటేశన్ స్వస్థలం తంజావురు జిల్లా నాయకర్ పేట్ గ్రామం. కోల్ కతా లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వెటరన్ గా పని చేస్తున్నారు. బంధువు పెళ్లి కోసం గత శుక్రవారం కోల్ కతా నుండి బుక్ చేసిన ఏసీ కోచ్ లో తమిళనాడుకు ప్రయాణిస్తుండగా బాలా సోర్ లో రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఆ తర్వాత బోల్తా పడింది. ఘోరం జరిగిందని భావించాడు. రైలు కంపార్ట్ మెంట్ లోనే ఇరుక్కు పోయాడు. కోచ్ లోంచి బయటకు రాగలిగాడు. ఆ తర్వాత అక్కడి పరిస్థితిని చూసి కన్నీటి పర్యంతం అయ్యాడు వెంకటేశన్. ఎక్కడికక్కడ మృత దేహాలు, ఆర్థనాదాలు, హాహాకారాలతో ఆ ప్రాంతం నిండి పోయింది.
ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. ఆ వెంటనే తేరుకున్నాడు. తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహించేందుకు కదిలాడు వెంకటేశన్. వెంటనే స్థానిక అధికారి కుంభకోణం సర్కిల్ తిరువిడైమరుధూర్ కు ఫోన్ చేశాడు. రైలు ప్రమాదం గురించి చొండా కలైయరసన్ కి తెలిపాడు. వెంటనే ఢిల్లీలోని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఆఫీస్ కు సమాచారం అందించాడు. సైనికులు అక్కడికి చేరుకునేందుకు ఆలస్యం కావడంతో వెంకటేశన్ తనే నిర్దేశించిన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యాడు. ఈ లోగా ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించేందుకు చుట్టు పక్కల వారు చేరుకున్నారు. తనతో పాటు మిగతా వారితో కలిసి సహాయక చర్యలలో భాగం పంచుకున్నాడు వెంకటేశన్. ఈ సందర్భంగా స్వగ్రామానికి చేరుకున్న వెంకటేశన్ కు తల్లి, భార్య, పిల్లలు, కుటుంబీకులు గ్రామస్థులు స్వాగతం పలికారు. వెంకటేశన్ చేసిన సాయానికి యావత్ దేశం సలాం చేస్తోంది. సీఎం ఎంకే స్టాలిన్ ప్రత్యేకంగా అభినందించారు.
Also Read : RS Praveen Kumar : కేసు తేలకుండానే పరీక్షలా – ఆర్ఎస్పీ
