Umar Ahmad Ganie Comment : నిన్న పెయింట‌ర్ నేడు టాప‌ర్

క‌ల్లోల కాశ్మీరంలోని యువ‌కుడి క‌థ‌

Umar Ahmad Ganie Comment : నిత్యం కాల్పుల మోతతో ద‌ద్ద‌రిల్లే క‌ల్లోల కాశ్మీరంలో ఓ యువ‌కుడు మెరిశాడు. కాలం ప‌రీక్ష‌కు గురి చేసినా, క‌ష్టం త‌న‌ను దాట‌కుండా ఇబ్బంది ప‌డేలా చేసినా ఎక్క‌డా తగ్గ లేదు. త‌ల వంచనూ లేదు. చిన్న గాయం త‌గిలితే విల విల లాడిపోయే యువ‌త ఉన్న నేటి స‌మాజంలో ఆ పోర‌డు ఎలాగైనా డాక్ట‌ర్ కావాల‌ని అనుకున్నాడు. ఆపై దేశ వ్యాప్తంగా వేలాది మంది పోటీ ప‌డే నీట్ లో ఎవ‌రూ ఊహించ‌ని స్థాయిలో టాప‌ర్ గా నిలిచాడు. ఇవాళ చ‌ర్చ‌నీయాంశంగా మారాడు. అంద‌రినీ విస్తు పోయేలా చేసిన ఆ యువ‌కుడే పుల్వామాకు చెందిన ఉమ‌ర్ అహ్మ‌ద్ గ‌నాయ్.

ఇంత‌టి ఘ‌న‌త‌ను సాధించేందుకు అత‌డు ఏం చేశాడో తెలుసుకుంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. చుట్టు ప‌క్క‌ల గ్రామాల్లో పెయింటర్ గా ప‌ని చేశాడు. అలా కూలీ ప‌ని చేస్తూనే చ‌దువుకున్నాడు. అత‌డికి చిన్న‌త‌నం నుంచే చ‌దువంటే చ‌చ్చేంత ఇష్టం. కానీ నీట్(NEET) కు ఎక్క‌డా పెయింటింగ్ ప‌ని అడ్డు కాలేదు. టాప‌ర్ గా రావ‌డంతో ఒక్క‌సారిగా లోక‌ల్ హీరో అయి పోయాడు. ఇవాళ యావ‌త్ యువ‌త అత‌డిని చూసి గ‌ర్వ ప‌డుతోంది. కుటుంబం గ‌డిచేందుకు ఇబ్బంది. ఈ స‌మ‌యంలో కూలీ ప‌నే అత‌డికి మిగిలింది. ఎక్క‌డా ప‌ని చేసేందుకు, ఇళ్ల‌కు పెయింటింగ్ వేసేందుకు సిగ్గు ప‌డ‌లేదు. పొద్దునంతా ప‌ని చేయాలి..రాత్రంతా చ‌దువు కోవాలి. అష్ట‌క‌ష్టాలు ప‌డుతూనే త‌ను క‌ల‌లు క‌న్న క‌లను నిజం చేసుకున్నాడు. క‌ష్ట‌ప‌డితే దేనినైనా సాధించ‌డం సుల‌భ‌మేన‌ని చాటి చెప్పాడు ఉమ‌ర్ అహ్మ‌ద్ గ‌నాయ్.

దేశంలోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప‌రీక్ష నీట్(NEET) . డాక్ట‌ర్ కావాలంటే ఈ ప‌రీక్ష రాయాల్సిందే. అందుకే దానిని ఛాలెంజ్ గా తీసుకున్నాడు. నిద్ర‌లేని రాత్రుళ్లు గ‌డిపాడు. ఏకంగా 601 స్కోర్ సాధించాడు. తాను ఏదో ఒక రోజు స‌క్సెస్ సాధిస్తాన‌ని త‌న‌కు తెలుసంటూ స్ప‌ష్టం చేశాడు. రోజూ కూలీకి వెళ్లాను. పెయింట‌ర్ గా పని చేసినందుకు రోజుకు నాకు రూ. 600 వ‌చ్చేవి. కానీ ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా రెండు సంవ‌త్స‌రాలు నేను ప‌నిలోనే ఉన్నా..కానీ ఏనాడూ చ‌దువు ప‌ట్ల నిర్ల‌క్ష్యం చేయ‌లేద‌న్నాడు. గ‌త 710 రోజులుగా నేను రోజుకు నిద్ర పోయింది కేవ‌లం 2 గంట‌లు మాత్ర‌మేన‌ని అని చెప్పాడు . అంద‌రికీ ఉద‌యం సంతోషంగా గ‌డుస్తుంది..కానీ నాకు , నా కుటుంబానికి మాత్రం ఎక్క‌డ కూలీ దొరుకుతుందోన‌ని బాధ‌. వారి కుటుంబంలో సోద‌రిలు కూడా నీట్ లో ర్యాంకులు పొంద‌డం విశేషం.

బ‌తుకు యుద్దంలో గెలుపొందాలంటే క‌ష్ట‌ప‌డ‌డం అనే ఆయుధాన్ని ధ‌రిస్తే చాలు స‌క్సెస్ అదంత‌ట అదే వ‌స్తుంద‌ని నిరూపించాడు ఈ కాశ్మీర్ కుర్రాడు. నేటి యువ‌త అత‌డిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది క‌దూ..హ్యాట్సాఫ్ యూ ఉమ‌ర్ అహ్మ‌ద్ గ‌నాయ్.

Also Read : Eric Garcetti Mk Stalin : స్టాలిన్ తో యుఎస్ రాయ‌బారి భేటీ

Leave A Reply

Your Email Id will not be published!