Gita Press Comment : అరుదైన పుర‌స్కారం సేవ‌కు స‌లాం

గీతా ప్రెస్ కృషి ప్ర‌శంస‌నీయం

Gita Press Comment : టెక్నాల‌జీ ఆధిప‌త్యం, మార్కెట్ మాయజాలాన్ని త‌ట్టుకుని నిల‌బ‌డాలంటే ఎంత ద‌మ్ముండాలి. ఇంకెంత నిజాయితీగా వ్య‌వ‌హ‌రించాలి. ప్ర‌పంచంలోనే అత్యంత పురాత‌న‌మైన సంస్థ‌గా గుర్తింపు పొందింది ఉత్త‌ర ప్ర‌ద‌శ్ లోని గోర‌ఖ్ పూర్ లో ఉన్న గీతా ప్రెస్. భార‌తీయ సంస్కృతిని ప‌రిచ‌యం చేస్తుంది. మూలాల‌ను గుర్తుకు తెస్తుంది. వందేళ్ల‌యినా ఇంకా త‌న ప్ర‌భావాన్ని కోల్పోలేదు. మే 3,1923లో గీతా ప్రెస్ ను జై ద‌యాళ్ గోయాంక‌, ఘ‌న్ శ్యామ్ దాస్ జ‌ల‌న్ స్థాపించారు. వారికి భ‌గ‌వ‌ద్గీత అంటే పంచ ప్రాణం. గీతా ప్రెస్ ప్ర‌చుర‌ణ‌ను ప్రారంభించింది. వేలాది పుస్త‌కాల‌ను ప్రచురించింది. అతి త‌క్కువ ధ‌ర‌కు వాటిని అంద‌జేస్తూ వ‌చ్చింది. హిందూయిజంకు సంబంధించిన వాటిని ప‌రిచ‌యం చేస్తుంది గీతా ప్రెస్. ఇది ప్ర‌త్యేకంగా హిందూ మ‌త గ్రంథాల‌ను ప్ర‌చురిస్తుంది. స‌నాత‌న ధ‌ర్మ సూత్రాల‌ను ప్ర‌చారం చేయ‌డం దీని ముఖ్య ఉద్దేశం.

గీతా ప్రెస్ తోనే ప‌త్రిక‌ను స్థాపించారు ఆనాడు. హ‌నుమాన్ ప్ర‌సాద్ పొద్దార్ దీనికి సంపాద‌కుడిగా ఉన్నారు. ఆయ‌న జీవిత కాలం ఎడిట‌ర్ గా కొన‌సాగుతూ వ‌చ్చారు. శివ్ , క‌ళ్యాణ్ పేర్ల‌తో వివిధ అంశాల‌కు సంబంధంచి లెక్క‌లేన‌న్ని వ్యాసాలు రాశారు. ఈ గీతా ప్రెస్ 1,600 కాపీల స‌ర్క్యులేష‌న్ తో 1927లో ప్రారంభ‌మైంది. రాను రాను అది 2,50,000 కు పైగా చేరుకుంది. ప్ర‌త్యేకించి చెప్పుకోవాల్సింది ఏమిటంటే భ‌గ‌వ‌ద్గీత‌. దీనికి సంబంధించి 100కి పైగా వివ‌ర‌ణల‌తో గీతా ప్రెస్(Gita Press) ప్రచురించింది. ముద్ర‌ణా సంస్థ‌ను ఆనాడు రూ. 600కు కొనుగోలు చేసింది. 140 మిలియ‌న్ల‌కు పైగా భ‌గ‌వద్గీత ప్రతుల‌ను , 100 మిలియ‌న్ల రామ్ చ‌రిత్ మాన‌స్ కాపీల‌ను ప్ర‌చురించింది. ఇది భార‌త దేశ చ‌రిత్ర‌లో ఓ రికార్డ్.

గ‌త ఏడాది మాజీ రాష్ట్ర‌ప‌తి గీతా ప్రెస్ శ‌తాబ్ది ఉత్స‌వాల‌ను ప్రారంభించారు. గీతా ప్రెస్ ఎలాంటి లాభా పేక్ష లేకుండా విశేష‌మైన కృషి చేసింది. ఇంకా ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంది. దీనిని కేంద్ర స‌ర్కార్ గుర్తించింది. ఈ మేర‌కు ప్ర‌ధాని అధ్య‌క్ష‌త‌న క‌లిగిన జ్యూరీ బృందం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు జాతిపిత మ‌హాత్మా గాందీ పేరుతో ఏర్పాటు చేసిన శాంతి బ‌హుమ‌తికి ఎంపిక చేశారు గీతా ప్రెస్(Gita Press) ను. మెరుగైన స‌మాజం కోసం, స‌నాత‌న ధ‌ర్మం కోసం, మానవీయ విలువ‌ల పున‌రుద్ద‌ర‌ణ కోసం కొన‌సాగిస్తూ వ‌స్తున్న ప్ర‌య‌త్నాన్ని అభినందించ‌కుండా ఉండ‌లేం. ఈ పుర‌స్కారం కింద రూ. కోటికి పైగా న‌గ‌దు బ‌హుమ‌తి అందుకోనింది. ఏది ఏమైనా ఇలాంటి సంస్థ ప‌ని చేస్తున్నందుకు మ‌న‌మంతా గ‌ర్వ‌ప‌డాలి.

Also Read : CM Yogi Adityanath : జ‌య‌హో రామ‌భ‌ద్రాచార్యా – యోగి

Leave A Reply

Your Email Id will not be published!