Shatrughan Sinha Rahul : రాహుల్ గాంధీ యూత్ ఐకాన్ – సిన్హా

రాబోయే రోజుల్లో మంచి భ‌విష్య‌త్తు

Shatrughan Sinha Rahul : ప్ర‌ముఖ న‌టుడు, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ శ‌త్రుఘ్న‌సిన్హా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని ఆకాశానికి ఎత్తేశారు. ఇటీవ‌ల బీజేపీకి రాజీనామా చేసి టీఎంసీలో చేరారు. ఆ వెంట‌నే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఎంపీగా గెలుపొందారు. భార‌త దేశంలో రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర అద్భుత‌మ‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం యూత్ కు రాహుల్ ఐకాన్ గా ఉన్నార‌ని కితాబు ఇచ్చారు టీఎంసీ ఎంపీ.

గ‌తంలో ప‌ప్పు అన్న వారు ఇవాళ రాహుల్ గాంధీని చూసి విస్తు పోతున్నార‌ని పేర్కొన్నారు. ఇవాళ దేశంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని, కేంద్ర స‌ర్కార్ ను ఏకి పారేస్తున్న , నిల‌దీస్తున్న‌, ప్ర‌శ్న‌ల‌తో నిప్పులు చెరుగుతున్న ఏకైక నాయ‌కుడు రాహుల్ గాంధీ అని స్ప‌ష్టం చేశారు శ‌త్రుఘ్న సిన్హా(Shatrughan Sinha).

రాహుల్ గాంధీ ప‌రిణ‌తి చెందిన నాయ‌కుడిగా ఎదిగార‌ని, ఇటీవ‌ల ఆయ‌న చేస్తున్న ప్ర‌సంగాలు, లేవ‌దీస్తున్న అంశాల‌కు జ‌వాబు చెప్ప‌లేని స్థితిలో కేంద్రం ప‌డి పోయింద‌ని ఎద్దేవా చేశారు. రాహుల్ సంధించిన ప్ర‌శ్న‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క దానికి కూడా ఆన్స‌ర్ ఇవ్వ‌క పోవ‌డం దేనికి సంకేత‌మ‌ని ప్ర‌శ్నించారు.

ఈ యువ నాయ‌కుడికి దేశంలో మంచి భ‌విష్య‌త్తు ఉంద‌ని ఆకాంక్షించారు. ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు సిన్హా. ఆయురారోగ్యాల‌తో ఆనందంగా ఉండాల‌ని కోరారు ఎంపీ.

Also Read : Pawan Kalyan Deeksha : ప్రజా సంక్షేమం కోసం ప‌వ‌న్ దీక్ష

 

Leave A Reply

Your Email Id will not be published!