Pawan Kalyan : జగన్ దౌర్జన్యం ఇకపై చెల్లదు
నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan : జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ ను ఏకి పారేశారు. సీఎం జగన్ రెడ్డిని టార్గెట్ చేశారు. వారాహి విజయ యాత్రలో భాగంగా ఆదివారం రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. పులివెందుల నుంచి వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నారని, వారి ఆటలు సాగవన్నారు. తాను ఎవరు వచ్చినా ఈ దౌర్జన్యాలను, అక్రమాలను అడ్డుకుని తీరుతానని స్పష్టం చేశారు. గోదావరి సంస్కృతి గురించి జగన్ నేర్చు కోలేదన్నారు.
వాళ్లకు ఎంత సేపు ఎవరిని చంపుదామా , ఎలా ఆక్రమించు కుందామా అన్న ఆలోచన తప్పితే ఇంకోటి చేత కాదంటూ సంచలన ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్. రాజోలు లో జనసేన(Janasena)ను గెలిచించాలని, ఆ వెలుగుల్ని రాజంపేట వరకు ప్రసరింప చేసేలా చేయాలని పిలుపునిచ్చారు. క్రిమినల్స్ (నేరస్థులు) రాజకీయాల్లో ఉంటే విలువలు పాటించే వారు లొంగి పోతారని పేర్కొన్నారు.
వైసీపీ ఫక్తు కుల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తోందంటూ మండిపడ్డారు. అలాంటి చవకబారు రాజకీయాల వల్లనే రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులు గోదారిని దాటి వెళ్లి పోయారంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ నిప్పులు చెరిగారు జనసేన పార్టీ చీఫ్.
Also Read : Gidugu Rudra Raju : వర్మ ‘వ్యూహం’ కాంగ్రెస్ ఆగ్రహం
