Delhi Govt Comment : క్యాంపస్ లు కావు ప్రభుత్వ బడులు
ఢిల్లీ ఆప్ సర్కార్ ప్రయత్నం భేష్
Delhi Govt Comment : నిత్యం రాజకీయాలలో తలమునకలై పోయిన ఈ దేశంలో ప్రాథమిక హక్కుల్లో ఒకటైన విద్యా రంగం పూర్తిగా కుదేలైంది. ఇది అంతులేని వ్యాపారంగా మారింది. ఇవాళ ఆక్టోపస్ లా విస్తరించింది. అగ్గిపెట్టె ల్లాంటి స్కూల్స్. కార్పొరేట్ శక్తుల ఆధిపత్యంలో కొట్టుమిట్టాడుతోంది ఈ రంగం. ఇందులో మాఫియాలు, డాన్ లు, పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, దొంగలు, ఆక్రమణదారుల చేతుల్లో బందీ అయి పోయింది. ఒక రకంగా చాలా చోట్ల విద్యా మాఫియా ఏకంగా ప్రభుత్వాలను శాసిస్తోంది. క్రిమినల్స్ సైతం ఇవాళ విద్యా సంస్థలను నడుపుతుండడం బాధా కరం. కానీ వీటన్నింటికి భిన్నంగా కొన్ని సంస్థలు విద్యార్థులను తీర్చి దిద్దే పనిలో పడ్డాయి. గతంలో గురుకులాలు ఉండేవి. కానీ ఇప్పుడు కులాల వారీగా సంస్థలను ఏర్పాటు చేసిన పరిస్థితి దాపురించింది.
ప్రస్తుతం విద్యా రంగం ఊరుమ్మడి సరుకుగా మారింది. ఫక్తు వ్యాపార కేంద్రంగా మారింది. కోట్లు కురిపిస్తోంది ఈ సెక్టార్. ఒక్క స్కూల్ లక్షల ఆదాయాన్ని సమకూరుస్తోంది. ఇక ఆన్ లైన్ లో కూడా ఈ జాడ్యం దాపురించింది. భారత రాజ్యాంగంలో విద్య అనేది ప్రాథమిక హక్కు. నిర్బంధ ఉచిత విద్య అన్నది అమలు చేయాలి. ఎక్కడ కూడా ఇది అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ తరుణంలో రెండు రాష్ట్రాల ప్రత్యేకంగా ప్రస్తావించక తప్పదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలోని ఢిల్లీ ప్రభుత్వం(Delhi Govt) బడులను కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా తీర్చిదిద్దింది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో కొలువు తీరిన ఆప్ సర్కార్ నాడు నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బడులను అత్యాధునిక రీతిలో నిర్మించింది.
భారత దేశ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ చెప్పినట్లు ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపు దిద్దుకుంటుందని. దీనిని వాస్తవ రూపంలోకి తీసుకు వచ్చేలా చేసిన ఘనత మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ప్రభుత్వ పరంగా విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. వేల కోట్లను ఖర్చు చేశారు. విద్యార్థులకు అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. ఇవాళ ప్రముఖుల పిల్లలు సైతం ఇతర వర్గాల పిల్లలతో చదువుకునేందుకు పోటీ పడుతున్నారు. కార్పొరేట్ కంపెనీలను తలపించేలా , యూనివర్శిటీలను గుర్తుకు తెచ్చేలా , క్యాంపస్ లను మరిపించేలా బడులను నిర్మించింది ఆప్ ప్రభుత్వం(Govt). ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ బడుల్లోనే చేరేందుకు ప్రయారిటీ ఇస్తున్నారు ఢిల్లీ వాసులు. ఆధునిక తరగతి గదుల నుండి లైబ్రరీ , ల్యాబ్, ప్లే గ్రౌండ్ వరకు అన్నీ ఉచితంగానే సమకూరుస్తోంది ప్రభుత్వం(Delhi Govt).
ఇక్కడ చదువుకునే విద్యార్థులు ప్రపంచ విద్యార్థులతో పోటీ పడేలా తీర్చిదిద్దుతోంది. పిల్లలకు చదువుకునేందుకు ట్యాబ్లెట్లను కూడా అందజేస్తోంది. నిపుణులైన అధ్యాపకులు, టీచర్లు, స్పెషల్ టీచర్లను కూడా ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేవలం విద్యా రంగానికి సంబంధిం రూ. 16,575 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించింది. ఇది ఢిల్లీ చరిత్రలో ఓ రికార్డు. మద్యం దుకాణాల కంటే ప్రభుత్వ బడులే నయం అన్నది అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చేయగలిగితే ఎంతో మేలు చేసిన వాళ్లవుతారు. ఏది ఏమైనా ఐఐటియన్ అయిన సీఎం కేజ్రీవాల్ చేసిన ఈ ప్రయత్నం అభినందనీయం.
Also Read : VES Solar System : వీఈఎస్ క్యాంపస్ మొత్తం సౌర విద్యుత్