Rahul Gandhi : శాంతి తప్ప మ‌రో మార్గం లేదు

మ‌ణిపూర్ గ‌వ‌ర్న‌ర్ తో రాహుల్ భేటీ

Rahul Gandhi : మ‌ణిపూర్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మ‌ర్యాద పూర్వ‌కంగా ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ అనుసూయా ఉకేని క‌లిశారు. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న ఘ‌ట‌న‌లు రాష్ట్రానికి, దేశానికి బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు. హింస ఎన్న‌టికీ ఆమోద యోగ్యం కాద‌ని అన్నారు. ప్ర‌స్తుతం కావాల్సింది బాధితుల‌కు భ‌రోసా అని తెలిపారు. కేంద్ర స‌ర్కార్ తో సంప్ర‌దింపులు జ‌రిపి ఆయా శిబిరాల వ‌ద్ద ప్రాథ‌మిక సౌక‌ర్యాల క‌ల్ప‌న‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గ‌వ‌ర్న‌ర్ ను కోరారు రాహుల్ గాంధీ.

ఈ సంద‌ర్బంగా రాజ్ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. ప్ర‌స్తుతం రాజ‌కీయాల గురించి మాట్లాడాల్సిన స‌మ‌యం కాదు. ప్ర‌తి ఒక్క‌రు పార్టీల‌కు అతీతంగా మ‌ణిపూర్ లో శాంతి నెల‌కొనేలా ప్ర‌య‌త్నం చేయాల‌ని పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఇందుకు గాను త‌మ పార్టీ స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

మ‌ణిపూర్ ప్ర‌జ‌ల‌తో నేను మాట్లాడాను. బాధితుల‌ను క‌లిశాను. పిల్ల‌ల‌తో క‌లిసి భోంచేశాను. వారికి అండ‌గా నిల‌వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇది భ‌యంక‌ర‌మైన విషాద‌మ‌ని ఆవేద‌న వ్య‌క‌త్ం చేశారు ఏఐసీసీ మాజీ చీఫ్‌. శిబిరాల‌లో ఆహారం, మందులు అందుబాటులో ఉండేలా చేయాల‌ని సూచించారు.

రాష్ట్రంలో పూర్తిగా ద‌య‌నీయ‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అక్క‌డ వేరే పార్టీకి చెందిన ప్ర‌భుత్వం ఉంద‌ని తాము ఆరోపించ‌డం లేదు. కేవ‌లం మాన‌వ‌తా దృక్ఫ‌థంతో మాత్ర‌మే సూచ‌న‌లు చేస్తున్నామ‌న్నారు రాహుల్ గాంధీ.

Also Read : Amit Shah Gehlot : అవినీతిలో గెహ్లాట్ స‌ర్కార్ నెంబ‌ర్ వ‌న్

Leave A Reply

Your Email Id will not be published!