Pakistan Security : ఇండియాకు పాక్ సెక్యూరిటీ రాక
భారత్ లో ఆడనున్న పాకిస్తాన్ టీమ్
Pakistan Security : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐసీసీ టోర్నీ షెడ్యూల్ ప్రకటించింది. ఇందులో భాగంగా దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 15న తలపడనున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొననుంది. ఇదిలా ఉండగా దాయాది దేశాల మధ్య సత్ సంబంధాలు లేవు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చివరి వరకు వస్తుందో రాదోనన్న అనుమానం వ్యక్తం చేసింది. ఐసీసీకి ఫిర్యాదు కూడా చేసింది.
మరో వైపు భద్రతా కారణాల సాకు చూపి భారత్ తాను పాకిస్తాన్ టూర్ కు రానంటూ మొండి కేసింది. దీనిపై బీసీసీఐ, పీసీబీ(PCB) పెద్ద ఎత్తున మాటల యుద్దం కొనసాగింది. చివరకు తటస్థ వేదికలపై ఆడేందుకు ఓకే చెప్పింది. విచిత్రం ఏమిటంటే భారత్ తో ఆడబోమంటూ ప్రకటించినా బీసీసీఐ వెనక్కి తగ్గలేదు. తమతో ఆడితే పాకిస్తాన్ కు లాభం తప్ప నష్టం ఉండదని, తమకు ఏమీ కాదంటూ పేర్కొంది. ఈ తరుణంలో ఐసీసీ చివరకు పీసీబీకి లాస్ట్ ఛాన్స్ ఇచ్చింది.
ఎట్టకేలకు పాకిస్తాన్ బోర్డు దిగి వచ్చింది. భారత్ లో ఆడేందుకు సుముఖత చూపింది. ఇదిలా ఉండగా భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడేందుకు అనుమతి ఇచ్చేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు పాకిస్తాన్ నుంచి భారత్ కు సెక్యూరిటీ టీంను పంపనుంది. ఇందులో భాగంగా పాక్ ఆడే ప్రదేశాలు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ , కోల్ కతా, అహ్మదాబాద్ లను తనిఖీ చేయనుంది. సెక్యూరిటీ ఓకే చెబితే పాకిస్తాన్ జట్టు రానుంది.
Also Read : Vasireddy Padma : 5న ఏపీ మహిళా కమిషన్ సదస్సు
