Foxconn Drops : ఫాక్స్ కాన్ షాక్ వేదాంతకు ఝలక్
ఒప్పందం నుంచి వైదొలిగిన కంపెనీ
Foxconn Drops : ఫాక్స్ కాన్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. గుజరాత్ లో సెమీ కండక్టర్స్ , డిస్ ప్లే ప్రొడక్షన్ ప్లాంట్ లను ఏర్పాటు చేసేందుకు వేదాంతతో $20 బిలియన్ల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా ఫాక్స్ కాన్ కంపెనీ గత ఏడాది 2022 సెప్టెంబర్ లో వేదాంత కంపెనీతో ఒప్పందం చేసుకుంది. భారీ ఎత్తున నిధులను పెట్టుబడిగా పెడుతున్నట్లు ప్రకటించింది. తాజాగా తాము ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడించింది.
ఎందుకు తప్పుకుంటున్నారనే దానిపై ఫాక్స్ కాన్(Foxconn) బయటకు వెళ్లడించలేదు. ఇక మార్కెట్ వర్గాలు తెలిపిన మేరకు ఆలస్యమైన ప్రోత్సాహక ఆమోదాలు విడి పోవడానికి దారి తీశాయని పేర్కొన్నాయి. అయితే మేక్ ఇన్ ఇండియా చిప్ ల పట్ల ఇంకా ప్రభావం చూపలేదని , కాగా భారత్ పట్ల తమ నిబద్దత కంటిన్యూగా కొనసాగుతుందని స్పష్టం చేసింది ఫాక్స్ కాన్ కంపెనీ.
వేదాంతతో జాయింట్ వెంచర్ పై ముందుకు సాగడం లేదని ఫాక్స్ కాన్ నిర్ణయించిందని గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. వేదాంత పూర్తి యాజమాన్యంలోని సంస్థ నుండి ఫాక్స్ కాన్ పేరును తొలగించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది. ఎలక్ట్రానిక్స్ తయారీలో నూతన యుగం కోసం భారత దేశ ఆర్థిక వ్యూహానికి మోదీ చిప్ మేకింగ్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది.
Also Read : Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.11 కోట్లు