TATA I Phone : ఐ ఫోన్ల తయారీదారుగా టాటా
తొలి భారతీయ కంపెనీగా రికార్డ్
TATA I Phone : రతన్ టాటా సారథ్యంలోని భారతీయ దిగ్గజ కంపెనీ టాటా గ్రూప్ కీలక ప్రకటన చేసింది. తొలి భారతీయ ఐఫోన్ తయారీదారుగా అవతరించే ఛాన్స్ ఉంది. త్వరలో రూ. 4,000 కోట్ల డీల్ కుదరనుందని సమాచారం. డీల్ చివరి దశలో ఉందని ఇదే గనుక పూర్తయితే భారతీయ వ్యాపార చరిత్రలో ఓ రికార్డుగా మారి పోతుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని ఎత్తుకుంది. ప్రపంచంలోని ప్రతి వస్తువును భారత్ లో తయారు చేయాలన్నది సంకల్పం. ఇందులో భాగంగా ఇప్పటికే పలు కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెడుతున్నాయి. మరికొన్ని రానున్నాయి. ఇప్పటికే సెమీ కండక్టర్, చిప్ తయారీలకు సంబంధించిన యూనిట్లు కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం మార్కెట్ వర్గాలు వెల్లడించిన ప్రకారం టాటా గ్రూప్(TATA I Phone) యాపిల్ ఇంక్ సరఫరాదారుగా ఉన్న విస్ట్రాన్ కార్పొరేషన్ యాజమాన్యంలోని కంపెనీని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు పూర్తయినట్టేనని టాక్. ఇదిలా ఉండగా ఒక ఇండియన్ కంపెనీ ఐ ఫోన్ల అసెంబ్లింగ్ లోకి ప్రవేశించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ కంపెనీ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. దీని విలువ $600 మిలియన్లకు పైగా ఉంది. ఇందుకు సంబంధించి ఒక ఏడాది పాటు చర్చలు జరుగుతున్నాయి.
Also Read : RK Roja Pawan Kalyan : వాలంటీర్లకు పవన్ క్షమాపణ చెప్పాలి