Elon Musk Modi : భారత్ లో టెస్లా కార్ల తయారీ యూనిట్
ప్రభుత్వంతో ఎలోన్ మస్క్ సుదీర్ఘ చర్చలు
Elon Musk Modi : భారత్ కు ఖుష్ కబర్ చెప్పారు ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా చైర్మన్ ఎలాన్ మస్క్. 500కె విద్యుత్ వాహనాల వార్షిక సామర్థ్యంతో కార్ల తయారీకి సంబంధించి కంపెనీ (యూనిట్) ను ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు అత్యున్నత టీం భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. మేడ్ ఇన్ ఇండియా టెస్లా ప్రారంభ ధర దాదాపు రూ. 20 లక్షలు ఉంవచ్చని అంచనా.
మరో వైపు ఎలోన్ మస్క్(Elon Musk) భారత దేశాన్ని ఇండో – పసిఫిక్ మార్కెట్లకు ఎగుమతి స్థావరంగా చూస్తున్నారు. స్థిరమైన ఇంధన భవిష్యత్తు కోసం దేశం సామర్థ్యాన్ని కూడా అంచనా వేస్తుండడం విశేషం. ఇదిలా ఉండగా ప్రపంచంలోని వాహనాల తయారీ రంగంలో ప్రధానంగా విద్యుత్ వాహనాల విషయంలో నెంబర్ వన్ గా కొనసాగుతోంది ఎలోన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ.
వరల్డ్ వైడ్ మార్కెట్ ను ఒక రకంగా సదరు కంపెనీ శాసిస్తోందని చెప్పక తప్పదు. టెస్లాకు ధీటుగా పలు కంపెనీలు వాహనాలను తయారు చేసినా దాని దరిదాపుల్లోకి వెళ్లలేక పోయాయి. ఇక భారత్ లో ఇప్పటికే టాటా, మహీంద్రా, హ్యూందాయి, కియా , తదితర కంపెనీలు ఫోకస్ పెట్టాయి. కానీ ఆకట్టుకోలేక పోతున్నాయి. ఒకవేళ టెస్లా గనుక తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తే కొంచెం ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉంది.
Also Read : Arvind Kejriwal : ఢిల్లీలో రెండు రోజులు నీళ్లకు కొరత