SS Rajamouli : పర్యావరణాన్ని కాపాడుకుందాం – జక్కన్న
మొక్కలు నాటిన ఎస్ఎస్ రాజమౌళి
SS Rajamouli : దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో మొక్కలను నాటకుండా, చెట్లను తొలగించుకుంటూ పోతే ఇబ్బందులు ఏర్పడుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రంగాలకు చెందిన వారు తమ తమ పరిధుల్లో, తమకు తోచిన సమయాల్లో చెట్లను , మొక్కలను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మనోడికి స్వంత ఫామ్ హౌస్ ఉంది. దీనిలో మొక్కలను , చెట్లను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మొక్కల ప్రాధాన్యత గురించి, పచ్చదనం పరిశుభ్రత గురించి ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తూ వస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ ను అభినందించారు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli).
ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం హరితహారం పేరుతో పర్యావరణాన్ని కాపాడుకునేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు, చెట్లను నాటడంపై ఫోకస్ పెట్టింది.
కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది సర్కార్. సీఎం కేసీఆర్ కు ఈ కార్యక్రమం అంటే ఇష్టం. ఆయన ఎక్కడికి వెళ్లినా, ఏ సభలో ప్రసంగించినా ముందుగా చెట్లను కాపాడు కోవాలని పిలుపునిస్తారు. చిన్నారుల నుంచి పెద్దల దాకా పర్యావరణం గురించి తెలుసు కోవాలని సూచించారు.
Also Read : SS Rajamouli : పర్యావరణాన్ని కాపాడుకుందాం – జక్కన్న