INDW vs BANW 2nd ODI : జెమీమా అదుర్స్ ఇండియా విక్టరీ
ఇక మూడో వన్డేకు రెడీ
INDW vs BANW 2nd ODI : బంగ్లా టూర్ లో భాగంగా ఆతిథ్య జట్టుతో జరిగిన కీలక మ్యాచ్(INDW vs BANW) లో భారత జట్టు ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. ప్రత్యేకించి జెమీమా దుమ్ము రేపింది. దీంతో టీమిండియా అద్బుత విజయాన్ని నమోదు చేసింది 2వ వన్డే మ్యాచ్ లో. దీంతో మూడు వన్డే మ్యాచ్ ల సీరీస్ లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలుపొందాయి. ఇక మూడో కీలక మ్యాచ్ ఉత్కంఠ రేపనుంది.
INDW vs BANW 2nd ODI Match
ఇదిలా ఉండగా ఢాకా లోని షేరే బంగ్లా నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. మ్యాచ్ లో భాగంగా బంగ్లా స్కిప్పర్ నిగర్ సుల్తానా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ కు దిగిన భారత మహిళా జట్టు ఆశించిన రీతిలో స్టార్టింగ్ లభించ లేదు. పునియా 7 పరుగులకే వెనుదిరిగితే యాస్తిక భాటియా 15 రన్స్ చేసి నిరాశ పరిచింది. ఈ దశలో కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుంది జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన. 36 రన్స్ చేసింది . రబియా అద్భుత బంతికి ఔట్ అయ్యింది.
మంధాన వెనుదిరిగాక బరిలోకి దిగిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ , జెమీమా రోడ్రిగ్స్ పరిస్థితిని చక్కదిద్దారు. 4వ వికెట్ కు 131 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెప్టెన్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంది. 52 రన్స్ చేసింది. జెమీమా అసాధారణ ఇన్నింగ్స్ ఆడింది. బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. 78 బాల్స్ ఎదుర్కొని 86 రన్స్ సాధించింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 228 రన్స్ తో భారీ స్కోర్ సాధించింది,
ఇక 229 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన బంగ్లా దేశ్ టీం 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఫర్గానా ఒక్కరే రాణఙంచింది. 47 రన్స్ చేసింది. అటు పరుగులతో చుక్కలు చూపించిన జెమీమా బౌలింగ్ లో సత్తా చాటింది. 3.1 ఓవర్లలో 3 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసింది.
Also Read : Jay Shah Grand Wishes : హ్యాపీ బర్తడే బాస్ – జే షా