Asia Cup Schedule : 2023 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్ – బీసీసీఐ
వెల్లడించిన కార్యదర్శి జే షా
Asia Cup Schedule : నీలి నీడలు కమ్ముకున్న ఆసియా కప్ కు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జే షా షెడ్యూల్(Asia Cup Schedule) ను ప్రకటించారు. ఇక దాయాదులైన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కీలక పోరు సెప్టెంబర్ 2న జరగనుంది. జే షా ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కు చైర్మన్ గా ఉన్నాడు. హైబ్రిడ్ పద్దతిలో టోర్నీ జరగనుంది. ఇక టోర్నీ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న కొలంబోలో జరగనుంది. టోర్నీకి సంబంధించి పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. భారత జట్టు తమతో ఆడితేనే తాము పాల్గొంటామని మొండికేసింది. చివరకు శ్రీలంక, పాకిస్తాన్ జట్లు ఆడేందుకు ఒప్పుకోవడంతో ఆసియా కప్ సజావుగా జరగనుంది.
Asia Cup Scheduled
4 మ్యాచ్ లు పాకిస్తాన్ లో , 9 మ్యాచ్ లకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. ఆగస్టు 30న ముల్తాన్ వేదికగా పాకిస్తాన్ తో నేపాల్ తలపడనుంది. ఆసియాకప్ ఈ మ్యాచ్ తో ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ లు కొలంబో వేదికగా జరగనున్నాయి. టోర్నీలో భాగంగా భారత్ తొలి మ్యాచ్ ను పాకిస్తాన్ తో ఆడనుంది. క్యాండీ ఆతిథ్యం ఇవ్వనుంది. టోర్నీలో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్ – ఎలో భారత్ , నేపాల్ , పాకిస్తాన్ ఉండగా గ్రూప్ – బిలో బంగ్లా దేశ్ , శ్రీలంక, ఆఫ్గనిస్తాన్ ఉన్నాయి.
షెడ్యూల్ పరంగా చూస్తే ఆగస్టు 30న ముల్తాన్ లో పాకిస్తాన్ వర్సెస్ నేపాల్ , 31న కాండీలో బంగ్లా వర్సెస్ శ్రీలంక తలపడతాయి. సెప్టెంబర్ 2న కాండీలో భారత్ , పాకిస్తాన్ ఢీకొంటాయి. 3న లాహోర్ లో బంగ్లాదేశ్ , పాకిస్తాన్ ఆడతాయి. 4న కాండీలో భారత్ , నేపాల్ మధ్య మ్యాచ్ జరగనుంది. 5న లాహోర్ లో ఆఫ్గనిస్తాన్ , శ్రీలంకతో తలపడనుంది.
ఇక సూపర్ -4లో సెప్టెంబర్ 6న ఏ1 వర్సెస్ బి 2 లాహోర్ లో , 9న బి1 వర్సెస్ బి2 కొలంబోలో , 10న ఏ1 వర్సెస్ ఏ2 మ్యాచ్ కొలంబలో, 12న ఏ2 వర్సెస్ బి1 కొలంబలో జరుగుతుంది. 14న ఏ1 వర్సెస్ బి1 కొలంబోలో , 15న ఏ2 వర్సెస్ బి2 మ్యాచ్ కొలంబోలో నిర్వహించనుంది. 17న సూపర్ 04 1 వర్సెస్ 2 కొలంబలో జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది.
Also Read : INDW vs BANW 2nd ODI : జెమీమా అదుర్స్ ఇండియా విక్టరీ