Project-K First look : ప్రాజెక్టు కె ఫ‌స్ట్ లుక్ అదుర్స్

యుద్దానికి సిద్దం అంటున్న అశ్విని

Project-K First look : మ‌హాన‌టి సినిమాతో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న యండ్ అండ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్ర‌భాస్ న‌టిస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ తో పాటు బాలీవుడ్ క్వీన్ దీపికా ప‌దుకొనే , క‌మ‌ల్ హాస‌న్ , అమితాబ్ బ‌చ్చ‌న్ లాంటి దిగ్గ‌జ న‌టులు ప్రాజెక్టు -కెలో న‌టిస్తుండ‌డం విశేషం. ఈ చిత్రాన్ని అశ్వ‌నిద‌త్ నిర్మిస్తున్నారు. భారీ బ‌డ్జెట్ తో సినిమాను రూపొందించే ప‌నిలో ప‌డ్డారు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్.

Project-K First Look Update

ఇదిలా ఉండ‌గా ప్రాజెక్ట్ కె అనేది సైన్స్ ఫిక్స‌న్ తో కూడుకున్న సినిమా అని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రో వైపు ప్ర‌భాస్(Prabhas) కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మూవీ మేక‌ర్స్. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది ఈ ఫ‌స్ట్ లుక్. ఇదిలా ఉండ‌గా ప్ర‌భాస్ ఇటీవ‌ల న‌టించిన ఆది పురుష్ సినిమాకు మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. అయినా ఎక్క‌డా త‌న మార్కెట్ త‌గ్గ‌లేద‌ని నిరూపించారు డార్లింగ్ ప్ర‌భాస్.

ఇదే స‌మ‌యంలో డైన‌మిక్ డైరెక్ట‌ర్ గా గుర్తింపు పొందిన ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్ తీస్తున్నాడు. ఇప్ప‌టికే దీనికి ఫుల్ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. అమెరికాలో ఇంకా రిలీజ్ కాకుండానే రికార్డుల మోత మోగిస్తోంది. మొత్తంగా ప్భాన్స్ కు పండ‌గే అని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : Telangana Govt : తెలంగాణ‌లో 5 ఐపీఎస్ లు బ‌దిలీ

Leave A Reply

Your Email Id will not be published!