Vangaveeti Asha Latha : ఆశాలత ఎంట్రీపై ఉత్కంఠ
వంగవీటి రంగా కూతురుపై చర్చ
Vangaveeti Asha Latha : ఎవరీ ఆశాలత అనుకుంటున్నారా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చెరగని ముద్ర వేసి , దారుణ హత్యకు గురైన వంగవీటి మోహన రంగా కూతురే ఈ ఆశాలత. రాష్ట్రంలో త్వరలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో కాపు సామాజిక వర్గానికి చెందిన రంగా(Vangaveeti Mohana Ranga) పేరును, పరపతిని స్వంతం చేసుకునేందుకు అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఆశా లతను రంగంలోకి దించాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Vangaveeti Asha Latha Intention
బెజవాడ సెంట్రల్ లేదా విజయవాడ వెస్ట్ నుంచి ఎన్నికల బరిలోకి దిగనుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆమెను రంగంలోకి దించితే ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పు కోవచ్చని ఆ దిశగా ఓట్లు రాబట్ట వచ్చని ప్లాన్ చేసినట్లు టాక్.
రంగా హత్య తర్వాత ఆయన భార్య రత్న కుమారి 1989, 1994 లో విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004లో రంగా తనయుడు వంగవీటి రాధా 2004లో అదే పార్టీ నుంచి విజయం సాధించారు. కాగా రాధా ఉన్నా ఆశించిన మేర రంగా వారసత్వాన్ని కొనసాగించ లేక పోయారన్న ప్రచారం లేక పోలేదు. రాధా స్థానంలో ఆశా లత ఉంటే బావుంటుందని ఆ దిశగా ఆయా పార్టీలు గాలం వేసే పనిలో పడ్డాయి.
Also Read : No Confidence Motion : కేంద్రంపై అవిశ్వాస తీర్మానం