Foxconn Unit : త‌మిళ‌నాడులో ఫాక్స్ కాన్ ప్లాంట్

రూ. 200 మిలియ‌న్ డాల‌ర్ల‌తో ఏర్పాటు

Foxconn Unit : ఫాక్స్ కాన్ తీపి క‌బురు చెప్పింది. త‌మిళ‌నాడులో రూ. 200 మిలియ‌న్ డాల‌ర్లతో విడి భాగాల ప్లాంట్ ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా ఫాక్స్ కాన్(Foxconn Unit) ఇండస్ట్రియ‌ల్ ఇంట‌ర్నెట్ సిఇవో బ్రాండ్ చెంగ్ , కంపెనీ ప్ర‌తినిధులు సీఎం ఎంకే స్టాలిన్ తో భేటీ అయ్యారు. వీరి మ‌ధ్య చ‌ర్చ‌లు ఫ‌లించాయి. రాష్ట్రంలో పెట్టుబ‌డుల‌పై చ‌ర్చించారు. విడి భాగాల ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ఇందు కోసం భారీ ఎత్తున ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఫాక్స్ కాన్ సిఇవో.

Foxconn Unit New Unit

ఇప్ప‌టికే ఫాక్స్ కాన్ బెంగ‌ళూరుకు స‌మీపంలో విడి భాగాల త‌యారీ యూనిట్ ను ఏర్పాటు చేసింది. క‌ర్నాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య‌తో భేటీ కావ‌డం, స‌ర్కార్ ఒప్పుకోవ‌డంతో ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది. మ‌రో వైపు ఫాక్స్ కాన్ కు త‌మిళ‌నాడులో ఇప్ప‌టికే ఓ ప్లాంట్ ఉంది. చెన్నై స‌మీపంలో క్యాంపస్ ను ఏర్పాటు చేసింది. స‌ద‌రు కంపెనీ ప్ర‌పంచంలో పేరు పొందిన ఆపిల్ ఐ ఫోన్ల కు సంబంధించిన ప‌రిక‌రాల‌ను ఉత్ప‌త్తి చేస్తుంది.

క‌మ్యూనికేష‌న్ , మొబైల్ నెట్ వ‌ర్క్ , క్లౌడ్ కంప్యూటింగ్ ప‌రిక‌రాల‌ను త‌యారు చేస్తుంది. రూ. 180 డాల‌ర్ల నుండి రూ. 200 డాల‌ర్ల దాకా ఇన్వెస్ట్ చేసేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు ఫాక్స్ కాన్ సిఇఓ స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఇరువురు వెల్ల‌డించ‌లేదు.

Also Read : Rahul Gandhi Comment : రాహుల్ చొర‌వ‌కు హ్యాట్సాఫ్

Leave A Reply

Your Email Id will not be published!