Pawan Kalyan Gaddar : ప్రజా యుద్దనౌకకు సలాం – పవన్
నివాళులు అర్పించిన కళ్యాణ్
Pawan Kalyan Gaddar : ప్రజా యుద్ద నౌక గద్దర్ కు మరణం లేదన్నారు జనసేన పార్టీ చీఫ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తన ఆట , పాటలతో కోట్లాది మంది ప్రజలను చైతన్యవంతం చేసిన గాయక యోధుడు గద్దర్ అని కొనియాడారు. లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజల సందర్శనార్థం ఏర్పాటు చేసిన గద్దర్ భౌతిక కాయాన్ని సందర్శించారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). ఆయనకు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి తాను ఉన్నానంటూ ధైర్యం చెప్పారు పవన్ కళ్యాణ్.
Pawan Kalyan Gaddar Paid Tribute
గద్దర్ మరణం యావత్ తెలంగాణ సమాజానికే కాదు ఆంధ్ర ప్రదేశ్ సమాజానికి, యావత్ దేశానికి తీరని లోటుగా పేర్కొన్నారు జనసేన పార్టీ చీఫ్. గద్దర్ లేక పోవడం తనకు పెద్ద నష్టమేనని వాపోయారు పవన్ కళ్యాణ్. తన జీవితమంతా పాట కోసం బతికిన వ్యక్తి. ఇలాంటి గాయకుడు మళ్లీ పుడతానని తాను అనుకోవడం లేదన్నారు జనసేనాని.
మా ఇద్దరి మధ్య కొన్నేళ్ల అనుబంధం ఉంది. ఆయన ఆట, పాటలు తనను ఎంతగానో ప్రభావితం చేస్తూ వచ్చాయని, ఆస్పత్రిలో చేరారని తెలుసుకుని పలకరించి వచ్చాను. ఆపరేషన్ అయ్యాక తిరిగి కలుస్తానని చెప్పానని అన్నారు పవన్ కళ్యాణ్. ఇంతలోపే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని తాను అనుకోలేదన్నారు. లోకం ఉన్నంత దాకా ఈ వీరుడు బతికే ఉంటాడని అన్నారు.
Also Read : Gopichand Malineni : గద్దరన్నకు మరణం లేదు