Adhir Ranjan Chowdhury : అమిత్ షా వైఫల్యం కాంగ్రెస్ ఆగ్రహం
మణిపూర్ లో భద్రతాల మోహరింపు
Adhir Ranjan Chowdhury : మణిపూర్ లో హింస, అల్లర్లను నియంత్రించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించింది కాంగ్రెస్(Congress) పార్టీ. బఫర్ జోన్ లో భద్రతా బలగాలను మోహరించానని సాక్షాత్తు లోక్ సభ సాక్షిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఒప్పుకున్నారని అన్నారు ఎంపీ అధిర్ రంజన్ చౌదరి . శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మణిపూర్ లో రోజు రోజుకు పరిస్థితి దిగజారిందని ఆవేదన చెందారు. సభలో స్వయంగా అంగీకరించారని పేర్కొన్నారు.
Adhir Ranjan Chowdhury Words
మణిపూర్ నుండి ఇప్పటి వరకు 5 వేలకు పైగా ఆధునిక ఆయుధాలు దోచుకున్నారని, దాని సంగతి బయటకు చెప్పక పోవడం దారుణమన్నారు. ఇప్పటి వరకు మూడు నెలలు దాటినా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం వైఫల్యం కాక మరేమిటి అని ప్రశ్నించారు అధిర్ రంజన్ చౌదరి.
ఇదే సమయంలో మోదీ ప్రభుత్వం సంప్రదాయ పద్దతులన్నింటినీ తుంగలో తొక్కుతూ ఒకదాని తర్వాత ఒకటి బిల్లును ఆమోదించిందని కానీ మణిపూర్ పై చర్చించేందుకు ఒప్పు కోలేదని ధ్వజమెత్తారు. ఈ సమయంలో ప్రతిపక్షాలు ఏ బిల్లు పైనా తమ అభిప్రాయాలను సమర్పించే అవకాశం లేకుండా పోయిందన్నారు ఎంపీ. 1978 సభలో అవిశ్వాస తీర్మానం తీసుకు రాగా అదే రోజున తీర్మానంపై చర్చ కూడా ప్రారంభమైందని గుర్తు చేశారు.
Also Read : Janasena Slams : అమర్నాథ్ భూదోపిడి సంగతేంటి