India Squad Asia Cup 2023 : ఆసియా కప్ ఇండియా స్క్వాడ్
ప్రకటించిన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ
India Squad Asia Cup 2023 : ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించే ఆసియా కప్ 2023(India Squad Asia Cup 2023) వచ్చే సెప్టెంబర్ నెలలో జరగనుంది. ఇప్పటికే పలు దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. తాజాగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ అజిత్ అగార్కర్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. ఈ మేరకు సంజూ శాంసన్ కు ఛాన్స్ దక్కింది. ఇదే సమయంలో ఐసీసీ వరల్డ్ కప్ ఈ ఏడాది భారత్ లో జరగనుంది. దీనిని బీసీసీఐ నిర్వహిస్తోంది. పాకిస్తాన్ కూడా ఆడుతోంది. ఈ టోర్నీలో 13 మ్యాచ్ లు జరగనున్నాయి.
India Squad Asia Cup 2023 Team
ఇక ఆసియా కప్ 2023లో ఆరు జట్లు పాల్గొననున్నాయి. ప్రస్తుతం ఆసియా కప్ ఛాంపియన్ గా శ్రీలంక జట్టు ఉంది. దుబాయి వేదికగా జరిగిన టోర్నీలో పాకిస్తాన్ ను ఓడించి విజేతగా నిలిచింది ఆ జట్టు. ఈసారి ఎవరు గెలుస్తారనేది చూడాల్సి ఉంది.
ఇక టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. శుభ్ మన్ గిల్ , ఇషాన్ కిషన్ , విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ , సంజూ శాంసన్ , హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ , చాహల్ , కుల్దీప్ యాదవ్ , జస్ప్రీత్ బుమ్రా , మహ్మద్ షమీ, సిరాజ్ ఆడతారు.
Also Read : Assam CM : నాకు ముస్లిం ఓట్లు అవసరం లేదు – సీఎం