Independence Day : ఇండిపెండెన్స్ డేకు ముస్తాబు
తెలంగాణ సచివాలయం సిద్దం
Independence Day : కోట్లు ఖర్చు చేసి నిర్మించిన సచివాలయం ఇప్పుడు ధగ ధగ మెరిసి పోతోంది. కారణం ఆగస్టు 15న దేశ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పాట్లలో మునిగి పోయింది. ఇప్పటి వరకు ఇంద్రభవనం లాగా నిర్మించిన ఈ సచివాలయం కోటలోకి ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదన్న ఆరోపణలు లేక పోలేదు.
Independence Day Preparation in Hyderabad
ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవానికి ఇది ప్రతీకగా ఉంటుందని బీఆర్ఎస్(BRS) నేతలు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో సవాలక్ష సమస్యలు పేరుకు పోయాయని, నియామకాల ఊసే లేదని వాపోతున్నారు. ఇక రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖలలో పని చేస్తున్న వారికి ఇప్పటి వరకు జీతాలు చెల్లించలేదు. రేపు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా నిర్వహిస్తారంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
ఓ వైపు బంగారు తెలంగాణ అంటూ మరో వైపు ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారనేది తెలియకుండా పోయిందని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. సంక్షేమ పథకాలు సరే కనీసం పని చేసినందుకు వేతనాలు ఇస్తే చాలని అదే పది వేలుగా తాము భావిస్తామని పేర్కొంటున్నారు. మొత్తంగా దేశానికి స్వేచ్ఛ లభించినా ఇంకా తమకు చీకటే మిగిలిందని అంటున్నారు. వాపోతున్నారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని టీఎస్ సీఎస్ ఆదేశించింది. మరో వైపు దేశానికి స్వేచ్ఛ లభించింది నేటితో 76 ఏళ్లవుతోంది. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.
Also Read : Jawan Chaleya Song : బాద్ షా చలేయా సాంగ్ హల్ చల్