Janasena Comment : పవన్ ఫోకస్ వారాహి సక్సెస్
ఏపీలో మారుతున్న పాలిటిక్స్
Janasena Comment : ఏపీలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలతో హోరెత్తిస్తున్నారు. ఇంకా శాసనసభ ఎన్నికలు జరిగేందుకు ఏడాది సమయం ఉంది. కానీ ఇప్పుడే పాలిటిక్స్ రంజుగా మారాయి. ప్రధానంగా జనసేన పార్టీ(Janasena Party) చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. స్టాండ్ మార్చారు. దూకుడు పెంచారు. గత ఎన్నికల్లో జనసేనకు ఆశించిన మేర సీట్లు రాలేదు. కానీ ఈసారి ఒంటరిగా పోటీ చేసేందుకైనా లేదా బీజేపీ, టీడీపీతో పొత్తు ఉంటుందా అన్నది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఈసారి జరగబోయే ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు.
తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. ఆయనకు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు ఏపీ ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో యువత, మహిళలు, సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా స్టేట్ లో భారతీయ జనతా పార్టీ , జనసేన కలిసి బరిలోకి దిగుతాయని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో కొలువు తీరిన వైసీపీ సర్కార్ కేంద్రం మంజూరు చేసిన పంచాయతీ నిధులను పక్కదారి పట్టించిందని ఆరోపిస్తూ బీజేపీ , జనసేన పార్టీలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా సంయుక్తంగా ఆందోళనలు చేపట్టాయి.
Janasena Comment Viral
ఇది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మోస్ట్ పాపులర్ లీడర్ గా తనను తాను ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డారు. ప్రధానంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని నిలదీస్తూ నిప్పులు చెరుగుతున్నారు. దమ్ముంటే నాతో పెట్టు కోవాలంటూ సవాళ్లు విసురుతున్నారు. దమ్ముంటే తనతో ఢీ కోవాలని రెచ్చి పోతున్నారు పవన్ కళ్యాణ్. ఏపీ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారి పోయేలా తాను ప్రయత్నిస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఏపీ అప్పుల కుప్పగా మారిందని, జగన్ రెడ్డి ప్రజల చెవుల్లో పూలు పెట్టాడంటూ మండిపడ్డారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలను ఏకి పారేస్తున్నారు. జనసేన పార్టీకి మరింత ఊపు తెచ్చేలా దుమ్ము రేపుతున్నారు.
ఇదే సమయంలో కేంద్రంలో కొలువు తీరిన బీజేపీకి మద్దతు ఇస్తూనే రాష్ట్రంలో వైసీపీపై ప్రత్యక్షంగా యుద్దానికి దిగారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). ఆయన ఇప్పటికే ఎన్నికల్లో సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందు కోసం కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేశారు. ఆ మేరకు ప్రచార రథాన్ని తయారు చేయించారు. దానికి వారాహి అని పేరు పెట్టారు. ఈ మేరకు వారాహి విజయ యాత్ర పేరుతో ఏపీలో ప్రచారం చేపట్టారు. ప్రస్తుతం రెండు విడతల క్యాంపెయిన్ పూర్తయింది. ప్రస్తుతం మూడో విడత కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే వైసీపీకి కొంత మేరకు ఇబ్బంది కలిగించే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన జెండా ఎగురుతుందా అన్నది వేచి చూడాలి. అది కాలమే సమాధానం చెప్పాలి.
Also Read : Pawan Kalyan : ఏపీలో మహిళలకు భద్రత ఏది
Super