Nara Lokesh : మంగళగిరిలో ఓడినా పనులు చేపట్టా
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
Nara Lokesh : తనను మంగళగిరి నియోజకవర్గ ప్రజలు గత ఎన్నికల్లో ఓడించినా తాను పట్టించు కోలేదని , కోపం తెచ్చు కోలేదన్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh). బుధవారం యువ గళం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో జయాప జయాలు సహజమన్నారు. 2019లో మంగళగిరి ఓటర్ దేవుళ్లు తనపై కరుణ చూప లేదన్నారు. ఓడినా ప్రజల మధ్యనే ఉంటూ వచ్చానని తెలిపారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ వారి వెంటనే ఉన్నానని తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా అధికార పార్టీ చేయలేనన్ని కార్యక్రమాలను తాను వ్యక్తిగత నిధులతో చేపట్టానని స్పష్టం చేశారు నారా లోకేష్.
Nara Lokesh Words About Mangalagiri
మంగళగిరి నియోజకవర్గంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు జలధార వాటర్ ట్యాంకర్లు, వైద్య సేవలకు ఆరోగ్య రథాలు, ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు, స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు కుట్టు మిషన్లు, చిరు వ్యాపారులకు తోపడు బళ్లు, చేనేతలకు రాట్నాలు, స్వర్ణ కారులకు పనిముట్లు , వికలాంగులకు ట్రై సైకిళ్లు, పాదచారులు సేద దీరేందుకు సిమెంట్ బల్లలు ఇలాంటి 27 సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నానని తెలిపారు.
అధికారం చేపట్టిన నాలుగు ఏళ్లలో నువ్వేం చేశావంటూ సీఎం జగన్ రెడ్డిని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీలకు గత సర్కార్ అమలు చేసిన 100 సంక్షేమ పథకాలను రద్దు చేశావంటూ ఆరోపించారు. క్యాంటీన్లను రద్దు చేసి పేదల నోట్లో మట్టి కొట్టావంటూ ఆవేదన వ్యక్తం చేశారు నారా లోకేష్.
Also Read : CM KCR Tour : కేసీఆర్ మెదక్ జిల్లా టూర్ వాయిదా