Vangaveeti Radha Pushpavalli : రాధా చేసుకోబోయేది ఈమెనే

న‌ర‌సాపురం కు చెందిన పుష్ప‌వ‌ల్లి

Vangaveeti Radha Pushpavalli : ఏపీలో ఇవాళ హాట్ టాపిక్ గా మారారు టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు వంగ‌వీటి రాధా కృష్ణ‌. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్లి చేసుకోలేదు. త‌న స్నేహితుడికి చెందిన బంధువుల అమ్మాయితో ఈనెల 19న ఎంగేజ్ మెంట్ ఉంద‌ని రాధా కుటుంబీలు వెల్ల‌డించారు. దీంతో రాధా అభిమానులు తెగ సంతోషానికి లోన‌వుతున్నారు.

Vangaveeti Radha Pushpavalli Marriage Vibes

ఇదిలా ఎంతో ఉత్కంఠ‌కు తెర దించారు వంగ‌వీటి రాధా కృష్ణ‌. 2004లో ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ త‌ర్వాత ఓట‌మి పాల‌య్యారు. ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌రుణంలో ఆయ‌న ఎటువైపు ఉంటార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

మాజీ మంత్రి కొడాలి నాని రాధా కృష్ణ(Vangaveeti Radha Pushpavalli) ఒక ఫంక్ష‌న్ లో క‌లుసుకున్నారు. దీంతో రాధా కృష్ణ వైసీపీలోకి చేరుతార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆయ‌న దానిపై స్పందించ లేదు. ఈ త‌రుణంలో రాధా ఉన్న‌ట్టుండి పెళ్లి చేసుకుంటార‌న్న వార్త హ‌ల్ చ‌ల్ చేసింది. చేసుకోబోయే అమ్మాయి ఎవ‌ర‌నే దానిపై ఆయ‌న అభిమానులు తెగ శోధించారు.

ఈ త‌రుణంలో ఆమె ఫోటో కోసం వెతికారు. చివ‌ర‌కు పెళ్లి కూతురు ఎవ‌రో తేలి పోయింది. న‌రసాపురం మాజీ మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ జక్కం ఆమ్మాణి, బాబ్జీల చిన్న కూతురు జ‌క్కెం పుష్ప‌వ‌ల్లీ అని తెలిసి పోయింది. మొత్తంగా ఆయ‌న ఫోటో ఇప్పుడు ల‌భించ‌డంతో అంతా హ్యాపీ అయ్యారు.

Also Read : Nara Lokesh : మంగ‌ళ‌గిరిలో ఓడినా ప‌నులు చేప‌ట్టా

Leave A Reply

Your Email Id will not be published!