న్యూఢిల్లీ : ఇండియా కూటమి నిరసనలపై 42 మంది మాజీ న్యాయమూర్తుల బహిరంగ లేఖ రాయడాన్ని స్వాగతించింది ఎన్డీఏ కూటమి. న్యాయమూర్తుల అభిప్రాయం సరైనదేనని పేర్కొన్నారు ఎన్డీఏ కూటమి నేతలు. ప్రతిపక్షం ‘అరాచక’ పరిస్థితులను సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వారు తమ చర్యలపై పునరాలో చించుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ , ఇతర రాజ్యాంగ సంస్థలను బలహీన పరిచేందుకు జరుగుతున్నట్లు ఆరోపించ బడుతున్న ప్రచారంపై సుప్రీంకోర్టు , హైకోర్టులకు చెందిన 42 మంది మాజీ న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ బహిరంగ లేఖ రాశారు. ఈ చర్యను పలువురు ఎన్డీఏ నేతలు స్వాగతించారు . న్యాయమూర్తుల అభిప్రాయం సరైనదేనని పేర్కొన్నారు. ప్రతిపక్షం ‘అరాచక’ పరిస్థితులను సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
బీహార్ మంత్రి రామ్ కృపాల్ యాదవ్ మాట్లాడుతూ మాజీ న్యాయమూర్తులు తమ లేఖలో మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అని అన్నారు.
ఎన్నికల సంఘంపై లేవనెత్తుతున్న ప్రశ్నలు రాజ్యాంగ వ్యవస్థను బలహీనపరిచే కుట్రలో భాగం. వీరు వివిధ రంగాలకు చెందిన నిపుణులు, న్యాయవాదులు, విజ్ఞానవంతులు. వారి అభిప్రాయం పూర్తిగా సరైనది. ప్రతిపక్షం అరాచక పరిస్థితులను సృష్టించాలని కోరుకుంటోంది అని ఆయన ఆరోపించారు. బీజేపీ జాతీయ ప్రతినిధి గురు ప్రకాష్ మాట్లాడుతూ వారి ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు, కారణం లేదా ప్రాతిపదిక లేవు అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తన వైఖరిని , రాజ్యాంగ పరమైన విశ్వసనీయతను పదేపదే స్పష్టం చేసింది. ‘ఫారం 6’ విషయంలో కూడా సుప్రీంకోర్టు తన వైఖరిని తెలిపింది. రాజ్యాంగ సంస్థలలో సభ్యులుగా పనిచేసిన 42 మంది మాజీ న్యాయమూర్తులు తమ ఆందోళనలను వ్యక్తం చేసినప్పుడు, ప్రతిపక్షం దానిపై ఆలోచించి, ఆత్మపరిశీలన చేసుకోవాలి అని ఆయన అన్నారు.
జేడీయు జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ మాట్లాడుతూ అనేక మంది రిటైర్డ్ న్యాయమూర్తులు ఈ విధంగా స్పందించారు. రాజ్యాంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని భారత ప్రజాస్వామ్యాన్ని బలహీన పరిచేందుకు ప్రతిపక్షం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు , దేశంలోని మేధావులు గమనిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు అర్థం చేసుకోవాలి అని అన్నారు.
