Jailer 400 Crore Club : జైల‌ర్ రికార్డ్ రూ. 400 కోట్ల క్ల‌బ్

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మేనియా

Jailer 400 Crore Club : నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జైల‌ర్ మూవీ రికార్డుల మోత మోగిస్తోంది. కేవ‌లం విడుద‌లైన ఆరు రోజుల్లో ఏకంగా రూ. 400 కోట్ల క్ల‌బ్ లోకి చేరి పోయింది. ఇది ర‌జ‌నీకాంత్ కెరీర్ లో సూప‌ర్ స‌క్సెస్ హిట్ మూవీగా నిలిచింది. అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ఇక త‌మ‌న్నా అందాలు కూడా సినిమాకు అస్సెట్ గా నిలిచాయి. మ‌రో వైపు త‌లైవా మేన‌రిజం, డైలాగ్ డెలివ‌రీ ఆక‌ట్టుకుంది. ర‌జ‌నీ కాంత్ తో పాటు త‌మ‌న్నా భాటియా, శివ రాజ్ కుమార్ , మోహ‌న్ లాల్ , యోగి బాబు న‌టించారు.

Jailer 400 Crore Club Crossing

ఆగ‌స్టు 10న జైల‌ర్ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. ఇదే స‌మ‌యంలో రిలీజ్ అయిన తెలుగు సూప‌ర్ స్టార్ చిరంజీవి న‌టించిన భోళా శంక‌ర్ పూర్తిగా అట్ట‌ర్ ప్లాప్ మూవీగా నిలిచి పోయింది. జైల‌ర్(Jailer) ఓవ‌ర్సీస్ లోనూ దుమ్ము రేపుతోంది. అమెరికాలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టింది.

సినిమాకు సంబంధించి క‌లెక్ష‌న్స్ ప‌రంగా చూస్తే 1వ రోజు రూ. 95.78 కోట్లు వ‌చ్చాయి. 2వ రోజు రూ. 56.24 కోట్లు, 3వ రోజు 68.51 కోట్లు, 4వ రోజు రూ. 82.36 కోట్లు, 5వ రోజు రూ.49.03 కోట్లు , 6వ రోజు రూ. 64.27 కోట్లు వ‌సూలు చేసింది ర‌జ‌నీకాంత్ జైల‌ర్ చిత్రం. మొత్తంగా ఆరు రోజులు క‌లిపి రూ. 416.19 కోట్లు కొల్ల‌గొట్టింది. ఇది ఓ రికార్డుగా నిలిచి పోయింది.

Also Read : Vangaveeti Radha Pushpavalli : రాధా చేసుకోబోయేది ఈమెనే

Leave A Reply

Your Email Id will not be published!