Ayutha Chandi Yagam : శ్రీశ్రీశ్రీ శ్రీకృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో జడ్చర్ల పట్టణంలో అయుత చండీ అతి రుద్ర యాగం అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతోంది. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 12 గంటల దాకా యాగ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. లోక కళ్యాణం కోసం ఈ యాగాన్ని స్వామి వారు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆగస్టు 14న ప్రారంభమైన అతిరుద్ర చండీ యాగం 27 వరకు కొనసాగనుంది.
Ayutha Chandi Yagam Till 27th August
ఈ సందర్బంగా నిర్వహించిన శ్రీవారి కళ్యాణోత్సవం నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సాగింది. భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఆగస్టు 20న ఆదివారం 7 గంటలకు భక్తులచే యాగశాల ప్రదక్షిణ, గణపతి పూజ శ్రీ సూర్య, సరస్వతి, ధైర్యలక్ష్మి హోమములు నిర్వహించారు.
11 గంటలకు అమ్మ వారికి భక్తులతో సామూహిక కుంకుమార్చన చేపట్టారు. మధ్యాహ్నం 1 గంటలకు అన్నదానం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు సరస్వతి పూజలు, బాల పూజలు (8 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు బాలత్రిపుర సుందరిగా బావించి పూజలు) నిర్వహిస్తారు. అనంతరం అల్పాహారం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు.
Also Read : Tirumala Nambi Utsavam : 24న తిరుమలనంబి మహోత్సవం