Rahul Gandhi : సూఫియాను అభినందించిన రాహుల్
భారత అల్ట్రా రన్నర్ గా గుర్తింపు
Rahul Gandhi : ప్రముఖ భారతీయ అల్ట్రా రన్నర్ సూఫియా సూఫీ ఆనందానికి లోనయ్యారు. అంతకు మించి ఆశ్చర్యానికి గురయ్యారు. కారణం ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ ఆమెను కలిసి ప్రత్యేకంగా అభినందించడం. ఈ విషయాన్ని తనే ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఇది వైరల్ గా మారింది.
Rahul Gandhi Met Sufiya Sufi
తన గురించి తెలుసుకుని ప్రత్యేక విందుకు తనను రాహుల్ గాంధీ ఆహ్వానించారని, తన జీవితంలో మరిచి పోలేని మైలు రాయిగా మిగిలి పోతుందని పేర్కొంది సూఫియా సూఫీ(Sufiya Sufi). ఇదిలా ఉండగా మనాలి నుండి లేహ్ వరకు రన్నర్ గా రికార్డు బ్రేక్ చేసింది. ఈ ప్రపంచ రికార్డును నమోదు చేసిన తర్వాత సూఫియాను ప్రతి ఒక్కరు అభినందనలతో ముంచెత్తుతున్నారు.
కాగా తన సాహస యాత్ర గురించి రాహుల్ గాంధీకి ఉన్న అవగాహనను చూసి తాను విస్తు పోయానని తెలిపింది సూఫియా. నా విజయాల పట్ల ఆయనకు ఉన్న నిజమైన ఆసక్తి, ప్రశంసల పట్ల గర్వంగా ఉందన్నారు. మా ఇద్దరి మధ్య అద్భుతమైన సంభాషణ చోటు చేసుకుందని తెలిపారు సూఫియా. సవాళ్లను స్వీకరించినప్పుడే విజయం దక్కుతుందని రాహుల్ గాంధీ చెప్పిన మాటలు తనకు ఇంకా గుర్తుకు వస్తున్నాయని పేర్కొంది.
Also Read : Ayutha Chandi Yagam : కమనీయం కళ్యాణోత్సవం