IND vs IRE 2nd T20 : భారత్ దెబ్బకు ఐర్లాండ్ బోల్తా
ఐర్లాండ్ కు 186 పరుగుల లక్ష్యం
IND vs IRE 2nd T20 : హమ్మయ్య ఎట్టకేలకు కేరళ స్టార్ సంజూ శాంసన్ రాణించాడు. రుతురాజ్ గైక్వాడ్ రెచ్చి పోతే యూపీ కుర్రాడు రింకూ సింగ్ దుమ్ము రేపాడు. ఐర్లాండ్ టూర్ లో భాగంగా జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని భారత జట్టు ఐర్లాండ్ తో 2వ టీ20(IND vs IRE 2nd T2o) మ్యాచ్ ఆడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 185 రన్స్ చేసింది. ఇప్పటికే తొలి టీ20 మ్యాచ్ భారత్ గెలుపొందింది. ఇక కీలకమైన రెండో మ్యాచ్ లో దుమ్ము రేపింది. ప్రత్యర్థి జట్టు ముందు 186 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది.
IND vs IRE 2nd T20 Good Innings
కేవలం 5 వికెట్లు కోల్పోయి 185 రన్స్ చేసింది. రుతు రాజ్ గైక్వాడ్ 43 బంతులు ఆడి 58 రన్స్ చేశాడు. సంజూ శాంసన్ 26 బంతుల్లో 40 రన్స్ చేశాడు. రింకూ సింగ్ 21 బంతులు ఎదుర్కొని 38 పరుగులు చేశాడు. ఐర్లాండ్ బౌలర్లలో బారీ మెక్ కార్తీ 2 వికెట్లు తీశాడు. ఇక ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
33 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది భారత్. దీంతో 2-0 తేడాతో టి20 సీరీస్ కైవసం చేసుకుంది. మూడు టీ20 మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా రెండు మ్యాచ్ గెలుపొందింది.
Also Read : Garuda Panchami TTD : తిరుమలలో గరుడ పంచమి