Akunuri Murali : ఓట్లేమో మనవి సీట్లేమో వాళ్లకా
ఎస్డీఎఫ్ కన్వీనర్ ఆకునూరి మురళి
Akunuri Murali : సోషల్ డెమోక్రటిక్ ఫోరమ్ (ఎస్డీఎఫ్) కన్వీనర్ ఆకునూరి మురళి నిప్పులు చెరిగారు. బుధవారం ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీ చీఫ్ , తెలంగాణ సీఎం ఎన్నికల సందర్భంగా 119 సీట్లకు గాను 115 సీట్లకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేశారు.
Akunuri Murali Slams KCR
దీనిపై తీవ్రంగా స్పందించారు ఆకునూరి మురళి(Akunuri Murali). ఇది ఏ లెక్కన, ఏ పద్దతిన కేటాయించారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉందని పేర్కొన్నారు. మనకు లక్ష రూపాయలు వాళ్లకు 1,000 కోట్లు ఏ లెక్కన ఇస్తున్నారో చెప్పాలన్నారు ఆకునూరి మురళి.
ప్రస్తుతం ప్రకటించిన సీట్లలో రాష్ట్ర జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు 22 సీట్లు కేటాయించారని , 10 శాతం ఉన్న ఓసీలకు 58 సీట్లు ఇచ్చారని కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సిగ్గు లేకుండా వెలమ, రెడ్లము పాలన సాగిస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. రూ. 500 ఇచ్చి, బీరు, బిర్యానీతో ఓట్లు కొనుగోలు చేయాలని అనుకోవడం దారుణమన్నారు .
అభ్యర్థుల కేటాయింపు లెక్కన చూస్తే కేసీఆర్ కు సామాజిక న్యాయం పాటించే ఆలోచన లేదని తేలి పోయిందన్నారు. తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్ కు తగిన రీతిలో బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఆకునూరి మురళి.
Also Read : AP CM YS Jagan : కంపెనీల ఏర్పాటు భారీగా కొలువులు