Chandrayan-3 Sand Art : చంద్రయాన్-3 సైకత శిల్పం
ఒడిశా పూరీ తీరంలో పట్నాయక్
Chandrayan-3 Sand Art : చంద్రుని ఉపరితలంపై ఇస్రో ఆధ్వర్యంలో చంద్రయాన్ -3 ఎలాంటి అవాంతరాలకు లోను కాకుండా సురక్షితంగా దిగింది. దీంతో భారత దేశ వ్యాప్తంగా సంబురాలు అంబరాన్ని తాకాయి. ఈ సందర్బంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తన అభిమానాన్ని చాటుకున్నారు.
Chandrayan-3 Sand Art Viral
ఒడిశా పూరీ సముద్ర తీరం వద్దకు వెళ్లారు. ఎంతో కష్టపడి చంద్రయాన్- 3(Chandrayan-3) సైకత శిల్పాన్ని తయారు చేశారు. భారత దేశాన్ని సగర్వంగా తల ఎత్తుకునేలా చేసినందుకు ఇస్రో చైర్మన్, టీం, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
తన విద్యార్థులు చంద్రయాన్ -3 సైకత శిల్పాన్ని తయారు చేశారని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా నిన్న సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ జాబిల్లిపై కాలు మోపింది. భారత వైజ్ఞానిక సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. 15 ఏళ్ల కిందట చంద్రుడిపై నీరు ఉందని తేల్చింది. విశ్వ పరిశోధనల్లో కొత్త శ్వాసను భారత్ నింపింది.
ఇప్పుడు చంద్రయాన్-3తో జాబిలిపై ఎవరూ వెళ్లని దారుల్లో వెళ్లింది. ఎవరూ చూడని దక్షిణ జాడల్ని ప్రపంచానికి చూపించిందని ప్రపంచ చరిత్ర సృష్టించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Also Read : PM Modi : నా జన్మ ధన్యమైంది – మోదీ
