Chandrayan-3 Comment : చంద్రుడి చెంత‌కు చంద్ర‌యాన్-3

అపురూపం..అద్భుతం..అమోఘం

Chandrayan-3 Comment : దేశం స‌గ‌ర్వంగా త‌ల ఎత్తుకుని నిలిచే స‌న్నివేశాలు చాలా అరుదుగా వ‌స్తుంటాయి. వాటిలో ఎల్ల‌ప్ప‌టికీ గుర్తుంచు కోద‌గిన క్ష‌ణం ఆగ‌స్టు 23. సాయంత్రం 6.04 గంట‌ల‌కు భార‌త దేశ అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ (ఇస్రో) ప్ర‌యోగించిన చంద్ర‌యాన్ -3 చంద్రుడి చెంత‌కు చేరింది. 140 కోట్ల భార‌తీయుల ఆశ‌ల‌ను నిజం చేసింది.

Chandrayan-3 Comment Trending

యావ‌త్ ప్ర‌పంచం విస్తు పోయేలా ఇస్రో త‌న స‌త్తాను చాటింది. దీని వెనుక ఎంతో శ్ర‌మ దాగి ఉంది. వంద‌లాది మంది ఏక కాలంలో క‌ష్ట‌ప‌డి శ్ర‌మిస్తే ఇది సాధ్య‌మైంది. నిజాయితీ, నిబ‌ద్ద‌త‌, అకుంఠిత దీక్ష‌, ప‌ట్టుద‌లతో పాటు దేశం ప‌ట్ల ప్రేమ ఉన్న‌ప్పుడే ఇలాంటి అసాధ్యాలు సాకారం అవుతాయి. ఇందుకు ప్ర‌త్యేకంగా పేరు పేరునా ఇస్రో చైర్మ‌న్, శాస్త్ర‌వేత్త‌ల‌ను, సిబ్బందిని అభినందించి తీరాల్సిందే.

ఇది మామూలు విజ‌యం కాదు. అలాగ‌ని ఇత‌ర దేశాల‌ను త‌క్కువ చేయ‌లేం. కానీ భార‌త దేశ అంత‌రిక్ష ప్ర‌యాణంలో చంద్ర‌యాన్ -3(Chandrayan-3) ఒక మైలు రాయిగా మిగిలి పోతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇది భార‌తీయ ప్ర‌జ‌లంద‌రి క‌ల‌కాల‌పు స్వప్నం. అబ్దుల్ క‌లాం చెప్పిన‌ట్లు క‌ల‌లు సాకారం అవుతాయి. వాటిని నెర‌వేర్చాల‌ని క‌ల‌లు కంటే.

ఇప్పుడు ఇస్రో అదే పని చేసింది. త‌న ప్ర‌యాణంలో ఎన్నో మైలు రాళ్లు ఉన్నాయి. మ‌రికొన్ని ఎగుడు దిగుడులు ఉన్నాయి. కానీ ప‌ని చేసుకుంటూ పోవ‌డ‌మే త‌మ ముందున్న ల‌క్ష్య‌మ‌ని చెప్ప‌క‌నే చెప్పారు ఇస్రో చైర్మ‌న్. ఇప్ప‌టి వ‌ర‌కు జాబిలి వ‌ద్ద‌కు చేరుకున్న‌ది మూడే దేశాలు. చైనా, అమెరికా, ర‌ష్యా.

ఇన్నేళ్లు గ‌డిచినా మిగ‌తా దేశాలు జాబిలి ద‌రిదాపుల్లోకి వెళ్ల లేక పోయాయి. ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాయి. కానీ విజ‌యం చేకూర‌లేదు. స‌క్సెస్ ద‌రికి రాలేదు. కానీ ఇస్రో ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించింది. శాస్త్ర సాంకేతిక రంగాల‌లో భార‌త దేశం అగ్ర రాజ్యాల‌తో స‌రి స‌మానంగా పోటీ ప‌డ‌గ‌ల‌ద‌ని చాటి చెప్పింది.

ఇవాళ జ‌రుపుకుంటున్న సంబురాల వెనుక ఎంద‌రో కృషి దాగి ఉంది. కొంద‌రు జీవించి ఉన్నారు. మ‌రికొంద‌రు ఇప్పుడు లేరు. కానీ ప్రతి విజ‌యోత్స‌పు స‌న్నివేశంలో వాళ్లు కూడా క‌ద‌లాడ‌తారు. ఎల్ల‌ప్ప‌టికీ ఉంటారు. ఏది ఏమైనా ఈ స‌క్సెస్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. జ‌య‌హో ఇస్రో..

Also Read : Bhatti Vikramarka : సిద్ద‌రామ‌య్య‌ను క‌లిసిన భ‌ట్టి

Leave A Reply

Your Email Id will not be published!