Danish Kaneria Slams : బీసీసీఐ తీరుపై కనేరియా కన్నెర్ర
రాహుల్ ఎంపికపై ఆగ్రహం
Danish Kaneria Slams : మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా(Danish Kaneria) సంచలన కామెంట్స్ చేశాడు. బీసీసీఐ ఆసియా కప్ లో పాల్గొనే భారత జట్టు ఎంపిక సరిగా లేదంటూ మండిపడ్డారు. ప్రత్యేకించి కేఎల్ రాహుల్ ను ఎలా ఎంపిక చేస్తారంటూ నిప్పులు చెరిగాడు.
ఎవరి ప్రమేయం వల్ల అతడిని , ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో చెప్పాలన్నాడు. ఒక ఆటగాడికి కనీసం 10 మ్యాచ్ లు ఆడే ఛాన్స్ ఇవ్వాలని సూచించాడు. ప్రత్యేకించి రాహుల్ ను ఎంపిక చేసి సంజూ శాంసన్ ను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేయడం దారుణమన్నాడు.
Danish Kaneria Slams BCCI
ఇది కావాలని శాంసన్ పట్ల చూపుతున్న వివక్ష తప్ప మరొకటి కాదని పేర్కొన్నాడు. ప్రత్యేకించి బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ , బీసీసీఐ సెక్రటరీ జే షాలు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించాడు.
ఎవరైనా ఆడుతున్న ఆటగాళ్లను తీసుకుంటారని కానీ గాయాల పాలై ఫామ్ కోసం నానా తంటాలు పడుతున్న కేఎల్ రాహుల్ ను ఎలా తీసుకున్నారో తనకు అర్థం కాలేదన్నాడు డానిష్ కనేరియా. రాహుల్ ను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేయాల్సి ఉండేదన్నాడు.
కేఎల్ రాహుల్ టెస్టు సీరీస్ లో ఫెయిల్ అయ్యాడు. వన్డే సీరీస్ లో ఆశించిన మేర రాణించ లేదు. కానీ సంజూ శాంసన్ రెండు మ్యాచ్ లలో ఆడనంత మాత్రాన అతడిని ఎలా పక్కన పెడతారంటూ నిలదీశాడు డానిష్ కనేరియా.
Also Read : PV Sunil Kumar IPS : కావాలని జై భీంను పక్కన పెట్టారు