CM KCR : అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీకగా నిలిచింది రాఖీ పండుగ. దేశ వ్యాప్తంగా రాఖీ ఫెస్టివల్ ను నిర్వహించారు. ఓ వైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆయన నివాసంలో చిన్నారులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రాఖీలు కట్టేందుకు క్యూ కట్టారు.
CM KCR Celebrates Rakhi Festival
తాజాగా ప్రగతి భవన్ లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ బాస్ , సీఎం కేసీఆర్(CM KCR) కు చెల్లెళ్లు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా చెల్లెళ్లకు సీఎం ఆశీర్వాదం అందజేశారు. మరో వైపు బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో రాఖీ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు.
ప్రగతి భవన్ లో రాఖీ పండుగను అంగరంగ వైభవంగా చేపట్టారు. ప్రతి ఏటా సీఎం కేసీఆర్ కు చెల్లెళ్లు ప్రేమ పూర్వకంగా రాఖీలను కట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఉన్నతాధికారులు సైతం సీఎంకు రాఖీలు కట్టారు.
మరో వైపు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మహిళలు రాఖీలు కట్టారు. ఏపీకి చెందిన మంత్రులు ఆర్కే రోజా సెల్వమణి , విడుదల రజనితో పాటు బ్రహ్మ కుమారీస్ మహిళలు రాఖీలు కట్టారు.
Also Read : Twitter New Features : ట్విట్టర్ లో వీడియో..ఆడియా కాల్స్