Twitter New Features : ట్విట్ట‌ర్ లో వీడియో..ఆడియా కాల్స్

కొత్త ఫీచ‌ర్స్ ప్ర‌క‌టించిన మ‌స్క్

Twitter New Features : ట్విట్ట‌ర్ సిఇఓ, టెస్లా చైర్మ‌న్ ఎలోన్ మ‌స్క్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్స్ తో ఇప్ప‌టికే ట్విట్ట‌ర్ కు జోడిస్తూ వ‌చ్చారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ సోష‌ల్ మీడియాలో ట్విట్ట‌ర్ టాప్ మైక్రో బ్లాగింగ్ సైట్ గా గుర్తింపు పొందింది.

Twitter New Features Introduced

గురువారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎలాంటి ఫోన్ నెంబ‌ర్ లేకుండానే, మొబైల్స్ ఉప‌యోగించ కుండా వీడియో, వాయిస్ కాల్స్ చేసుకునే స‌దుపాయం తీసుకు వ‌స్తున్న‌ట్లు వెల్ల‌డించారు ఎలోన్ మ‌స్క్(Elon Musk). ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌తో ఒక్క‌సారిగా యావ‌త్ ప్ర‌పంచం విస్మ‌యానికి గురైంది.

ఇప్ప‌టికే విద్యుత్ కార్ల త‌యారీలో వ‌ర‌ల్డ్ లోనే నెంబ‌ర్ 1గా ఉన్న ఎలోన్ మ‌స్క్ ఊహించ‌ని రీతిలో ట్విట్ట‌ర్ ను టేకోవ‌ర్ చేసుకున్నాడు. ఆపై కీల‌క సంస్క‌ర‌ణ‌లు తీసుకు వ‌చ్చాడు. తాజాగా వీడియో, ఆడియో కాల్స్ చేసుకునే స‌దుపాయం ఏ టెక్ మాధ్య‌మంలో ఉండడం లేదు.

కొత్త ఫీచ‌ర్స్ త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్నాయ‌ని ప్ర‌క‌టించారు సిఇఓ ఎలోన్ మ‌స్క్. ట్విట్ట‌ర్ కాల్ లు ఇక నుంచి ఐఓఎస్ , ఆండ్రాయిడ్ , మాక్ , పీసీల‌లో ప‌ని చేస్తాయ‌ని వెల్ల‌డించారు.

Also Read : Babar Azam Breaks : బాబ‌ర్ ఆజ‌మ్ అరుదైన రికార్డ్

Leave A Reply

Your Email Id will not be published!