Sajjala Ramakrishna Reddy : బాబులో భయం మొదలైంది
సజ్జల రామకృష్ణా రెడ్డి కామెంట్స్
Sajjala Ramakrishna Reddy : తాడేపల్లి గూడెం – ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా తనను ఇవాళో రేపో అరెస్ట్ చేయడం ఖాయమని పేర్కొన్నడంపై స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Sajjala Ramakrishna Reddy Comments Viral
గతంలో తాను సీఎంగా ఉన్న సమయంలో అడ్డగోలుగా కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆధారాలతో సహా ఇన్ కం ట్యాక్స్ శాఖ ప్రశ్నించిందని, త్వరలో అరెస్ట్ చేయడం ఖాయమని జోష్యం చెప్పారు.
నిన్నటి దాకా తమపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజల్లో మరింత భయాందోళనలు రెచ్చగొట్టేందుకు చంద్రబాబు నాయుడు, తనయుడు నారా లోకేష్ నాయుడు ప్రయ్నతం చేశారని ఆరోపించారు. కాలం ఒకే తీరుగా ఎప్పుడూ ఉండదన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.
తాను ఎలాంటి తప్పు చేయక పోతే అరెస్ట్ చేస్తారేమోనని ఎందుకని అంటారంటూ ప్రశ్నించారు సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy). చంద్రబాబు అయినా లేదా ఇంకొకరైనా చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు. రూ. 118 కోట్ల ముడుపుల వ్యవహారంపై నోరు విప్పాల్సిన చంద్రబాబు నాయుడు ఉన్నట్టుండి అరెస్ట్ చేస్తారంటూ కొత్త రాగం అందుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
Also Read : TSRTC WIFI : టీఎస్ఆర్టీసీ వైఫై ఫ్రీ