RTC Bill Approved : ఆర్టీసీ బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

సంత‌కం చేసిన త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్

RTC Bill Approved : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గురువారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ 2023 బిల్లుకు ఆమోదం తెలిపిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వానికి సంత‌కం చేసిన బిల్లును పంపిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

RTC Bill Approved by Telangana Governer

ఇప్ప‌టికే రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు అసెంబ్లీ సాక్షిగా ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. దీనికి శాస‌న‌స‌భ‌లో ఉన్న స‌భ్యులు ఆమోదం తెలిపారు.

ఈ మేర‌కు ప్ర‌భుత్వంలో విలీనం చేసేందుకు గాను ప్ర‌భుత్వం ఆర్టీసీ బిల్లు 2023ను రూపొందించింది. దీనిని ఆమోదించేందుకు గాను గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై(Tamilisai Soundararajan) కి పంపింది. ఇదిలా ఉండ‌గా బిల్లును పూర్తిగా చ‌దివిన అనంత‌రం సంత‌కం చేయ‌లేదు . దీంతో పెద్ద ఎత్తున ఆందోళ‌న నెల‌కొంది.

గ‌వ‌ర్న‌ర్ కు వ్య‌తిరేకంగా ఆర్టీసీకి చెందిన వేలాది మంది ఉద్యోగులు రాజ్ భ‌వ‌న్ ను ముట్టించేందుకు య‌త్నించారు. పెద్ద ఎత్తున ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. ప‌లు అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తూ అభ్యంత‌రం తెలిపారు గ‌వ‌ర్న‌ర్. చివ‌ర‌కు దీనికి సంబంధించి ప్ర‌భుత్వం త‌ర‌పున సీఎస్ క్లారిఫికేష‌న్ ఇచ్చింది.

చివ‌ర‌కు మొత్తం బిల్లును ప‌రిశీలించిన అనంత‌రం ఇవాళ గ‌వ‌ర్న‌ర్ సంత‌కం చేస్తూ ..ఆర్టీసీ ఉద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పారు.

Also Read : Telangana Congress : సోనియాను మ‌రిచి పోతే ఎలా

Leave A Reply

Your Email Id will not be published!